‘2.0’లో ఆ పాట ప్లేస్మెంట్ మారబోతోంది

‘2.0’లో ఆ పాట ప్లేస్మెంట్ మారబోతోంది

ఇండియన్ సినిమాల్లో పాటలకు ఉన్న ప్రాధాన్యం ఎలాంటిదో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మన సినిమా ఎంత అడ్వాన్స్ అయినప్పటికీ.. పాటలు.. ఫైట్లు లాంటి స్పెషల్ అట్రాక్షన్స్ ఆశిస్తారు ప్రేక్షకులు. పాటల్ని రిలీఫ్ లాగానో.. ఒక స్పెషల్ ఎంటర్టైన్మెంట్ లాగానో ఫీలవుతారు. అందుకే హాలీవుడ్ స్టయిల్లో సినిమాలు తీసినా పాటలు ఇరికిస్తుంటారు డైరెక్టర్లు. ‘బాహుబలి’ లాంటి సినిమాలో సైతం పాటలకున్న ప్రాధాన్యం ఎలాంటిదో చూశాం.

రాజమౌళి కంటే ముందు ఇండియన్ సినిమాను ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన శంకర్ సైతం పాటల మీద ప్రత్యేకంగా దృష్టిసారిస్తుంటాడు. భారీ ఖర్చుతో సాంగ్స్ చిత్రీకరిస్తుంటాడు. ఐతే ‘2.0’లో పాటలకు అసలు చోటే లేకుండా చేశాడు. ఏకంగా రూ.20 కోట్ల ఖర్చు పెట్టి ‘యంతర లోకపు సుందరివే’ పాట తీశాడు కానీ.. దాన్ని సినిమాలో పెట్టలేదు. అంతా అయ్యాక రోలింగ్ టైటిల్స్ దగ్గర దాన్ని ప్లేస్ చేశాడు. ఐతే అది ప్రేక్షకులకు రుచించలేదు. ఈ పాట సినిమాలో ఉంటేనే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమైంది.

నిజానికి ఈ పాటకు సినిమాలో లీడ్ సీన్ కూడా ఉంది. అక్కడ పాట రాబోతుందని కూడా ప్రేక్షకులు ఆశిస్తారు. కానీ సినిమా ఫ్లో దెబ్బ తింటుందని అనుకున్నాడో ఏమో కానీ.. అక్కడ పాట కట్ చేసి రోలింగ్ టైటిల్స్ దగ్గర పెట్టాడు. ఐతే అప్పటికే సినిమా ముగిసిందని జనాలు వెళ్లిపోతుండటంతో ఆ పాట వృథా అయిపోయిందన్న ఫీలింగ్ మేకర్స్‌కు కలిగిందట. దీంతో ఈ పాటను ముందుకు తీసుకొచ్చి సినిమాలోనే పెట్టబోతున్నట్లు సమాచారం. శనివారం ఉదయం షోల నుంచి ఈ మార్పు జరుగుతుందట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English