చరణ్‌ హీరోయిన్‌కి మళ్లీ చేదు అనుభవమే!

చరణ్‌ హీరోయిన్‌కి మళ్లీ చేదు అనుభవమే!

రామ్‌ చరణ్‌తో 'ఎవడు' చిత్రంలో నటించిన ఏమీ జాక్సన్‌ ఆ తర్వాత శంకర్‌ కంట్లో పడింది. 'ఐ' చిత్రంలో ఆమెని కథానాయకిగా తీసుకున్న శంకర్‌ అటు తర్వాత '2.0'లో ఛాన్స్‌ ఇచ్చాడు. ఐ చేసినంత కాలం వేరే సినిమాలు సైన్‌ చేయరాదని అగ్రిమెంట్‌ రాయించుకుంటే, 2.0 తర్వాత తన రేంజ్‌ మారిపోతుందనే నమ్మకంతో అది విడుదలయ్యే వరకు మరో సినిమా చేయరాదని ఈ బ్రిటిష్‌ సుందరి తనంతట తానుగా ఫిక్స్‌ అయిపోయింది.

తన షూటింగ్‌ ఏడాది క్రితమే పూర్తయినా కానీ ఈలోగా ఏ సినిమా సైన్‌ చేయకుండా ఇంగ్లండ్‌లోనే కాలక్షేపం చేసింది. ఐ చిత్రంతో తనకి బ్రేక్‌ వస్తుందని ఆశించిన ఏమీకి ఆ చిత్రం వల్ల పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే శంకర్‌కి ఆమె బాగా నచ్చడంతో 2.0లో కూడా అవకాశం వరించింది. ఈ చిత్రంలో ఆడ రోబోగా నటించడం వల్ల ఏమీకి గ్లామరస్‌గా కనిపించే వీలు చిక్కలేదు. ఇంటర్నెట్‌ని వేడెక్కించే రీతిలో రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేసే ఏమీ ఇందులో రోబో డ్రస్సులేసుకుని కనిపించడం ఆమె అభిమానులని నిరాశ పరుస్తోంది.

పైగా సినిమా మొత్తం రజనీ, అక్షయ్‌కుమార్‌ చుట్టూ తిరగడం, ఒక్క పాట మినహా ఏమీకి సాంగ్స్‌ కూడా లేకపోవడంతో ఆమెకి ఈ సినిమా వల్ల ఒరిగేదేమీ వుండదు. ఈ చిత్రంతో జాతకం మారిపోతుందనే నమ్మకంతో ఏడాది ఖాళీగా వున్న ఏమీ ఇప్పుడైనా తన గ్లామర్‌కి న్యాయం చేసే సినిమాలని ఎంచుకుంటుందో లేదో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English