మురుగదాస్ అలా రాసి సంతకం పెట్టాలట..

మురుగదాస్ అలా రాసి సంతకం పెట్టాలట..

తమిళనాట ‘సర్కార్’ వివాదం ఇంకా సమసిపోలేదు. ఈ సినిమాలో ప్రభుత్వాన్ని కించపరిచే సన్నివేశాలు ఉన్నాయంటూ అధికార అన్నాడీఎంకే పార్టీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఒక దశలో ప్రభుత్వం దర్శకుడు మురుగదాస్‌‌ను అరెస్టు చేయడానికి కూడా ప్రయత్నించగా.. ఆయన జాగ్రత్త పడి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు.

ప్రభుత్వం పట్టుబట్టి ఇందులో కొన్ని సన్నివేశాల్ని తొలగించేలా చేసి పంతం నెగ్గించుకుంది. అంతటితో ఆగకుండా కేసులు పెట్టించి మురుగదాస్‌‌ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఈ వ్యవహారం కోర్టుకు చేరింది. అక్కడ మురుగదాస్‌ తీరును ప్రభుత్వ లాయర్లు తీవ్రంగా తప్పుబట్టారు. మురుగదాస్ ‘సర్కార్’ సినిమాలో ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ పథకాలపై విమర్శలు గుప్పించారన్నారు.

ఇందుకు గాను మరుగదాస్ ప్రభుత్వానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతే కాక ఇకపై తాను ఎన్నడూ తన సినిమాల్లో ప్రభుత్వాన్ని కించపరిచే సన్నివేశాలు పెట్టనని హామీ పత్రం రాసి సంతకం పెట్టి ఇవ్వాలని కూడా ప్రభుత్వ లాయర్లు డిమాండ్ చేయడం గమనార్హం. ఐతే మురుగదాస్ దీనికి దీటుగా బదులిచ్చాడు. ఆయన లాయర్లు తమ వాదన వినిపించారు.

దేనిపైన అయినా తన అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ మురుగదాస్‌కు ఉందని.. ఆయన చేసింది తప్పు అని రుజువు కాకుండా క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని.. అలాగే హామీ పత్రాలేమీ రాసిచ్చేది లేదని స్పష్టం చేశారు. మరి ప్రతిగా ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. మొత్తానికి ఓవైపు ‘సర్కార్’ థియేట్రికల్ రన్ దాదాపుగా ముగిసిపోయినప్పటికీ.. ఈ సినిమాకు సంబంధించిన వివాదం అయితే ఇప్పటికీ తమిళనాట చర్చనీయాంశం అవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English