అతిథి మర్యాద ఇరగదీస్తోన్న దిల్‌ రాజు

అతిథి మర్యాద ఇరగదీస్తోన్న దిల్‌ రాజు

తమిళంలో ఘన విజయం సాధించిన 96 చిత్రం రీమేక్‌ హక్కులని సొంతం చేసుకున్న దిల్‌ రాజు ఒరిజినల్‌ తీసిన ప్రేమ్‌ కుమార్‌తోనే రీమేక్‌ చేయబోతున్నాడు. ఇంకా హీరో ఎవరనేది ఖరారు కాలేదు కానీ బన్నీ పేరు అయితే బాగా వినిపిస్తోంది. కథని కనుక అల్లు అర్జున్‌ ఇమేజ్‌కి తగ్గట్టు మలిస్తే రీమేక్‌లో నటించడానికి అతను సరే అన్నాడట. దీంతో ఈ రీమేక్‌పై దిల్‌ రాజుకి మరింత మక్కువ పెరిగింది. అసలే ఈమధ్య పరాజయాల్లో వుండి తన బ్యానర్‌ కళ కాస్త తగ్గిందేమో మళ్లీ ఇలాంటి ఉత్తమ చిత్రాన్ని అందించి తన సంస్థ ప్రతిష్ట పెంచుకోవాలని చూస్తున్నాడు.

ప్రేమ్‌ కుమార్‌ కనుక అల్లు అర్జున్‌కి నచ్చేలా కథనం తిరిగి రాయగలిగితే దిల్‌ రాజుకి వ్యాపార పరంగా రిస్కు కూడా తగ్గిపోతుంది. అందుకేనేమో ప్రేమ్‌ కుమార్‌కి దిల్‌ రాజు రాచ మర్యాదలు చేయిస్తున్నాడట. సాధారణంగా దిల్‌ రాజు బ్యానర్లో సినిమాలు చేసే తెలుగు దర్శకులకి తన ఆఫీస్‌లోనే ఒక గది ఇచ్చేస్తుంటాడు. కానీ ప్రేమ్‌ కుమార్‌కి ఒక విలాసవంతమైన ఆఫీస్‌తో పాటు తన టీమ్‌లోని మెరికల్లాంటి కుర్రాళ్లని కూడా సాయం పంపించాడు. ఎంత టైమ్‌ అయినా తీసుకోమని, తెలుగు రీమేక్‌ మాత్రం తమిళం కంటే అదిరిపోవాలని మాత్రం ప్రేమ్‌ కుమార్‌ని కోరాడట. తమిళ దర్శకుడికి దిల్‌ రాజు దగ్గర ఇలాంటి మర్యాదలు కామన్‌ అనిపిస్తాయేమో కానీ రాజుతో రెగ్యులర్‌గా పని చేసే దర్శకులు మాత్రం ఈ స్పెషల్‌ ట్రీట్‌మెంట్‌ చూసి కుళ్లుకుంటున్నారట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English