త్రివిక్రమ్‌ ఎక్కడ్నుంచి ఎక్కడికి పడ్డాడు!

త్రివిక్రమ్‌ ఎక్కడ్నుంచి ఎక్కడికి పడ్డాడు!

ఫాన్స్‌ మాత్రమే కాదు, త్రివిక్రమ్‌ని చాలా మంది హీరోలు కూడా 'గురూజీ'గానే సంబోధిస్తారు. తన జ్ఞాన సంపదతో ఎవరినైనా మెప్పించేసే త్రివిక్రమ్‌ ఒకప్పుడు ఎంత చెబితే అంతే. దర్శకుడిగా ఆయన స్థాయి తగ్గుతూ వచ్చే కొద్దీ ఆయనకి ఇచ్చే గౌరవం, ఆయన మాట మీద వుంచే నమ్మకం కూడా తగ్గుతున్నాయని ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోంది. త్రివిక్రమ్‌ సినిమా చేస్తానని ఒప్పుకోవడమే మహా ప్రసాదం అన్నట్టుండేది ఇంతకుముందు. కానీ ఇప్పుడది మారుతోంది. త్రివిక్రమ్‌ ఏది చెబితే అది చేయకూడదని, నచ్చితేనే చేయాలని హీరోలు డిసైడవుతున్నారు. అజ్ఞాతవాసి పరాజయం త్రివిక్రమ్‌పై అనుమానాలు రేకెత్తించింది.

అగ్ర దర్శకులు అడపాదడపా ఫెయిలవుతుంటారు కానీ అజ్ఞాతవాసి లాంటి పరాజయం అంత తేలికగా తీసుకునేది కాదు. సదరు దర్శకుడి ఆలోచనా ధోరణిపై కూడా అనుమానాలు రేకెత్తించే స్థాయి పరాజయమది. అజ్ఞాతవాసి తర్వాత ఎన్టీఆర్‌తో చేద్దామని అనుకున్న ఫ్యామిలీ సినిమాని ఫ్యాక్షన్‌ సినిమాగా మార్చడంతోనే త్రివిక్రమ్‌ కాన్ఫిడెన్స్‌ లెవల్స్‌ బహిర్గతమయ్యాయి. అరవింద సమేత చిత్రంలో త్రివిక్రమ్‌ దర్శకుడిగా ఫామ్‌లో లేడనే విషయాన్ని మళ్లీ రుజువు చేయడంతో ఇప్పుడు అల్లు అర్జున్‌ ఆయన చెప్పే కథలకి వంకలు చెప్పడం, రిజెక్ట్‌ చేయడం కూడా చేస్తున్నాడట. జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి టైమ్‌లో గురూజీ ఎంత చెబితే అంత అనుకున్న అల్లు అర్జున్‌కి ఇప్పుడు గురూజీపై గురి లేదన్నమాట. సొంత కథ రాయడానికి అవస్థలు పడుతూ కాపీ వ్యవహారాలతో నెట్టుకొస్తోన్న త్రివిక్రమ్‌ ప్రస్తుతం రీమేక్‌ చేయడానికి కూడా సై అనేయడం చూస్తోంటే ప్రస్తుతం ఆయన సిట్యువేషన్‌ ఏమిటనేది స్పష్టమవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English