సూపర్ స్టార్ అలా ఒప్పేసుకున్నాడేంటి??

సూపర్ స్టార్ అలా ఒప్పేసుకున్నాడేంటి??

రాంగ్ సినిమా పడిందంటే చాలు.. డైరక్టర్ ను తిట్టడం, లేదంటే రైటర్ తప్పు చేశాడని చెప్పడం, లేకపోతే ప్రొడ్యూసర్ బలవంతం చేశాడంటూ అబాండం వేయడం. చాలామంది హీరోల తంతు ఇదే తరహాలో ఉంది. కాని ఒక సూపర్ స్టార్ మాత్రం.. ఏకంగా ఆడియన్స్ కు సారీ చెప్పేస్తున్నాడు. అందుకే అతడ్ని మిష్టర్ పర్ఫెక్ట్ అనేది.

ఈ మధ్యనే బాక్సీఫీస్ దగ్గర సందడి చేయడానికి వచ్చిన థగ్స్ ఆఫ్ హిందోస్తాన్ సినిమా భారీగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. అసలు అమీర్ ఖాన్ సినిమా కదా.. మినిమం గ్యారంటీగా ఉంటుందని ఊహిస్తే.. సినిమా మాత్రం ఘోరంగా ఉంది. అందుకే వెంటనే స్పందించిన అమీర్, తాము చాలా కష్టపడ్డామని, అయినాకూడా ఎక్కడో భారీగా ఫెయిల్ అయ్యామని, అందుకే ఆడియన్స్ కు సినిమా నచ్చలేదని చెప్పాడని. అయితే తదుపరి సినిమాతో మరింత గట్టిగా ప్రయత్నిస్తానని, ఈసారి తన అభిమానులను నిరాశపరచనంటూ చెప్పుకొచ్చాడు. మొత్తానికి సినిమా రిలీజై ధియేటర్లను నుండి వెళ్లిపోయిన వెంటనే ఒక స్టార్ హీరో ఇలా ఓపెన్ అవ్వడమంటే చాలా రేర్ అనే చెప్పాలి.

అయితే ఇక్కడే అమీర్ క్యారక్టర్ గురించి ప్రస్తావిస్తున్నారు బాలీవుడ్ విశ్లేషకులు. అలా ముక్కుసూటిగా నిక్కార్సుగా ఉంటాడు కాబట్టే, అమీర్ ఖాన్ సినిమాలకు అంత గిరాకీ ఏర్పడిందని, పైగా అతను ఇలా డైరక్టర్లను బ్లేమ్ చేయకపోవడం వలన, రేపు చాలామంది దర్శకుడు అతనికి మంచి మంచి కథలను కూడా ఇస్తారని అంటున్నారు. ఏదేమైనా కూడా సూపర్ స్టార్ ఈజ్ సింప్లీ గ్రేట్ అంతే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English