ఏది తీసుకున్నా అమ్మడికి బ్యాండేగా..

ఏది తీసుకున్నా అమ్మడికి బ్యాండేగా..

కొంతమంది హీరోయిన్లు అంతే.. వాళ్ళు ఎంత కష్టపడినా హిట్టుమాత్రం రాదు. కాని కొంతమంది భామలకు మాత్రం సింపుల్ గా బ్లాక్ బస్టర్లు చేతిలో పడుతుంటాయి. ఈ రెండో తరహా భామలను కాస్త పక్కనెట్టేస్తే.. మొదటి కోవకు చెందిన ఒక బ్యూటీ ఎవరంటే.. మలయాళం ఎన్నారై ముద్దుగుమ్మ అను ఎమ్మానుయేల్ అని చెప్పుకోవాల్సిందే.

అప్పట్లో మజ్ఞూ సినిమాతో ఇలా వచ్చిందో లేదో తెలుగులో ఆఫర్లు అలా వచ్చేశాయి. కాని బ్యాడ్ లక్ ఏంటంటే.. అమ్మడు ఆ తరువాత చేసిన సినిమాలన్నీ ఫ్లాపులే. ఈమె యాక్టింగ్ అంతంత మాత్రమే కాని.. గ్లామర్ డోస్ మాత్రం కుర్రకారును బాగానే కవ్వించేసింది. కాని ఏం లాభం.. హిట్లుమాత్రం పడలేదు. అయితే అమ్మడు కొన్ని సినిమాలను వదిలేసుకుంది అనే టాక్ ఉంది. కాని ఆ వదిలేసిన సినిమాలు కూడా పెద్ద ఇరగదీసిన బాపత్తు కాదులే. రవితేజ అమర్ అక్బర్ ఆంటోని నుండి డేట్స్ క్లాష్‌ వలన తప్పుకుంది అను. కాని ఆ ప్లేసులో ఆమె చేసిన శైలజా రెడ్డి అల్లుడు రిజల్ట్.. అలాగే శ్రీను వైట్ల సినిమా రిజల్ట్ కూడా మనకు తెలిసిందే. అల్లు అర్జున్ తో నా పేరు సూర్య సినిమా ఒప్పుకుని.. విజయ్ దేవరకొండ నోటా సినిమాను వదిలేసుకుంది. వాటి రిజల్ట్స్ కూడా తెలిసిందే.

ఆ విధంగా.. ఎటు చూసినా కూడా అను ఎమ్మానుయేల్ కు బ్యాండ్ అనేది తప్పలేదు. కాని ఆమెకు మలయాళంలో మాత్రం చార్లి మరియు ఇతర బ్లాకబస్టర్ సినిమాల్లో ముందుగానే ఛాన్సులు వచ్చాయి. తెలుగు కెరియర్ కోసం వాటిని వదులుకుంది. లేకపోతే అక్కడన్నా హిట్లు వచ్చేశేవే!!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English