అల్లు అర్జున్‌ దానిని చెడగొట్టడు కదా!

అల్లు అర్జున్‌ దానిని చెడగొట్టడు కదా!

స్టార్‌ హీరోలకి కొన్ని కథలు సూట్‌ అవవు. అందుకే చాలా సందర్భాల్లో కథ ఎంత బాగా నచ్చినా కానీ తమ ఇమేజ్‌ వల్ల వర్కవుట్‌ కాదని హీరోలే కథని వదిలేసుకుంటూ వుంటారు. అయితే ఒక్కోసారి బాగా కనక్ట్‌ అయిపోయి, తమకి సూట్‌ అవదని తెలిసినా చేసేసి చేతులు కాల్చుకుంటారు. ప్రస్తుతం అల్లు అర్జున్‌ కూడా అలాగే '96' అనే తమిళ చిత్రానికి విపరీతంగా ఆకర్షితుడు అయిపోయాడనే టాక్‌ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని చూసిన వెంటనే సదరు దర్శకుడితో రీమేక్‌ గురించి అల్లు అర్జున్‌ మాట్లాడేసాడట. తనతో చేస్తే ఎలాంటి మార్పులు చేస్తావని కూడా అడిగాడట. ఒకవేళ తాను నటించకపోతే, తన బ్యానర్లో నిర్మించాలని భావిస్తున్నాడని కూడా ప్రచారం జరిగింది.

కానీ అల్లు అర్జున్‌ ఈ చిత్రం రీమేక్‌ చేయడానికే ఫిక్స్‌ అయిపోయాడని, కాకపోతే తమిళ చిత్రంలో మాదిరిగా కిడ్స్‌ ఎపిసోడ్‌ ఎక్కువ సమయం వుండకుండా, హీరో పాత్ర మరీ అంత పాసివ్‌గా లేకుండా చూడాలని దర్శకుడు ప్రేమ్‌ కుమార్‌కి చెప్పాడట. 96 చిత్రం అన్ని ప్రశంసలు అందుకోవడానికి కారణం అల్లు అర్జున్‌ పైన అడిగిన లాంటి వాటికి కాంప్రమైజ్‌ కాకపోవడం వల్లేనని మరచిపోకూడదు. విజయ్‌ సేతుపతి కథలో పాత్రగానే కనిపించాడు తప్ప హీరోలా అనిపించలేదు. అదే ఈ చిత్రానికి పెద్ద ప్లస్‌ అయింది. ఇప్పుడు అల్లు అర్జున్‌ని హీరోని చేసి, అతని పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో కథ నడిపిస్తే దాని బ్యూటీ చెడిపోయి ఇంకేదో తయారయ్యే ప్రమాదముంది. అల్లు అర్జున్‌ లాంటి స్టార్లు ప్రయోగాలు చేయడానికి ముందుకి రావడం శుభ పరిణామమే అయినా కానీ కథ తాలూకు ఆత్మకి స్టార్‌డమ్‌ ఆటంకంగా మారితే అది విపరిణామమవుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English