హీరోయిన్ల విషయంలో రాజీ పడిపోతున్న ఎన్టీఆర్‌

హీరోయిన్ల విషయంలో రాజీ పడిపోతున్న ఎన్టీఆర్‌

ఎన్టీఆర్‌ బయోపిక్‌లో ఎవరు ఏ క్యారెక్టర్‌ చేయాలనే విషయంపై క్రిష్‌ చాలా శ్రద్ధ వహిస్తున్నాడు. క్యారెక్టర్‌ స్కెచ్‌లు, ఆయా నటీనటులు ఆ పాత్రలని సజీవంగా మారుస్తున్న తీరు 'ఎన్టీఆర్‌' చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ తెచ్చిపెట్టాయి. ఎన్టీఆర్‌ జీవితంలోని ప్రతి ముఖ్య పాత్ర విషయంలో క్రిష్‌ కాస్టింగ్‌ పరంగా తీసుకున్న కేర్‌ ప్రశంసలు అందుకుంటోంది. మగవాళ్ల పాత్రల పరంగా ఏమాత్రం రాజీ పడకుండా లుక్‌ రాబడుతోన్న క్రిష్‌ లేడీ క్యారెక్టర్ల పరంగా మాత్రం రాజీ పడిపోతున్నట్టు కనిపిస్తోంది. శ్రీదేవి పాత్రలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఎంతగా ట్రోలింగ్‌కి గురయిందో తెలిసిందే.

జయప్రదగా హన్సిక, జయసుధగా పాయల్‌ రాజ్‌పుట్‌ అని తెలిసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. సహజ నటీమణులుగా పేరొందిన వారిద్దరి పాత్రలకి వీరిని సెలక్ట్‌ చేయడమేంటని, కనీసం ఇద్దరూ పోలికల పరంగా కూడా వారిని మ్యాచ్‌ చేయలేరని కామెంట్స్‌ పడుతున్నాయి. సావిత్రిగా నిత్య మీనన్‌ తప్ప మిగతా హీరోయిన్ల విషయంలో క్రిష్‌ రాజీ పడిపోయినట్టు కనిపిస్తోంది. బయోపిక్‌ అంటే సదరు నటీనటులు అచ్చంగా అప్పటి వారిని ప్రతిబింబించాల్సిన అవసరం లేదు కానీ ముందు రిలీజ్‌ చేసిన క్యారెక్టర్‌ స్కెచ్‌లతో క్రిష్‌ తనకి తానే ఒక బెంచ్‌మార్క్‌ పెట్టేసుకున్నాడు. దీంతో ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి చిన్న అంశంలోను అదే స్టాండర్డ్‌ని జనం ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English