దీపిక-రణ్వీర్ వీడియో వైరల్

దీపిక-రణ్వీర్ వీడియో వైరల్

బాలీవుడ్లో ఈ ఏడాది పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. సోనమ్ కపూర్.. నేహా ధూపియా లాంటి సెలబ్రెటీలు ఈ ఏడాదే వివాహం చేసుకున్నారు. ఐతే మిగతా పెళ్లిళ్లన్నీ ఒకెత్తయితే.. దీపికా పదుకొనే-రణ్వీర్ సింగ్‌ల పెళ్లి మరో ఎత్తు. ఇద్దరూ సూపర్ స్టార్లే కావడంతో వీరి పెళ్లికి విపరీతమైన ప్రచారం దక్కింది. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న వీళ్లిద్దరూ ఎట్టకేలకు ఈ నెలలోనే పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వారం రోజులుగా హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా పెళ్లి తర్వాత వీళ్లిద్దరి మీద తీసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. రణ్వీర్‌ను గుర్తుకు తెచ్చుకోగానే.. అందరికీ అతడి కోర మీసం తలపుల్లోకి వస్తుంది. బాలీవుడ్లో చాలావరకు మీసం లేని హీరోలే కనిపిస్తారు.

కానీ రణ్వీర్ మాత్రం మీసం పెంచుతాడు. పైగా అది కొంచెం పొడవుంటుంది. దాన్ని సుడి తిప్పడం అతడికి అలవాటు. రణ్వీర్‌లో ప్రత్యేకంగా కనిపించేది ఆ మీసమే. కానీ దాన్ని దీపిక కట్ చేసేసింది. స్వయంగా కత్తెర తీసుకుని రణ్వీర్ మీసాన్ని కట్ చేసి.. ఎస్ అంటూ సింహనాదం చేస్తున్న దృశ్యం ఈ వీడియో కనిపించింది. మీసం కట్ చేశాక రణ్వీర్ కొంచెం ఆశ్చర్యంగా ఫేస్ పెట్టాడు. చాలా సరదాగా అనిపిస్తున్న ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. పెళ్లి తర్వాత ఏ మగాడైనా అహం వీడి భార్య చెప్పినట్లు నడుచుకోవాల్సిందే అని సంకేతాలిచ్చేలా ఈ వీడియో ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English