టాక్సీవాలాకి థర్డ్‌ ప్లేస్‌!

 టాక్సీవాలాకి థర్డ్‌ ప్లేస్‌!

విజయ్‌ దేవరకొండ సినిమాల్లో టాక్సీవాలా చిత్రానికి వసూళ్ల పరంగా మూడవ స్థానం దక్కేలా వుంది. వారం రోజుల్లో పదహారు కోట్లకి పైగా షేర్‌ వసూలు చేసిన ఈ చిత్రం విజయ్‌ చిత్రాల్లో మొదటి వారంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల్లో రెండవ స్థానాన్ని దక్కించుకుంది. ఈ వీకెండ్‌లో కూడా చాలా బాగా పర్‌ఫార్మ్‌ చేసిన ఈ చిత్రం ఫైనల్‌గా ఇరవై కోట్ల మార్కుని దాటే అవకాశాలున్నాయి.

వచ్చే వారం 2.0 రిలీజ్‌ అవుతుంది కనుక గురువారం తర్వాత టాక్సీవాలా ఇక ముందుకి కదలకపోవచ్చు. అంటే గీత గోవిందం (అరవై అయిదు కోట్లు), అర్జున్‌ రెడ్డి (ఇరవై అయిదు కోట్లు) తర్వాత టాక్సీవాలాకి విజయ్‌ సినిమాల్లో మూడవ స్థానం ఖాయం చేసుకోవచ్చు. ప్రస్తుతం విజయ్‌కి వున్న మార్కెట్‌ రీత్యా ఇరవై కోట్లు పెద్ద సంఖ్య కాకపోవచ్చు కానీ టాక్సీవాలా చిత్రానికి వున్న లిమిటేషన్స్‌కి, దానికి జరిగిన లీకేజులకి ఇది పెద్ద అఛీవ్‌మెంట్‌గానే చెప్పాలి.

ముఖ్యంగా సినిమాకి అన్ని లెక్కలూ కలుపుకుని ఏడు కోట్ల పైచిలుకు మాత్రమే కాగా, థియేటర్ల నుంచే దానికి మూడు రెట్లు తెచ్చుకోవడమంటే మాటలు కాదు కదా. ఇక మిగతా రైట్స్‌ అన్నీ కలుపుకుంటే నిర్మాతలు పెద్ద జాక్‌పాటే కొట్టేసారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English