తెలుగోళ్లకీ టేస్ట్‌ చూపిస్తాడంట

తెలుగోళ్లకీ టేస్ట్‌ చూపిస్తాడంట

తమిళ దర్శకుల్లో చాలా మందికి తెలుగునాట కూడా మంచి క్రేజ్‌ ఉంది కానీ ప్రత్యేకించి బాలా అంటే మాత్రం ఎంతోమంది పడి చచ్చిపోతారు. ఇతర దర్శకులకి పూర్తి భిన్నంగా ఆలోచిస్తూ, డార్క్‌ కాన్సెప్ట్స్‌, క్యారెక్టర్స్‌తో సినిమాలు తీస్తూ కూడా హిట్లు కొట్టడం ఇతని స్పెషాలిటీ. ఏ నటుడికైనా పూర్తిస్థాయి పరీక్ష పెట్టే బాలా దర్శక సామర్ధ్యం గురించి తెలుగు హీరోలకి తెలియనిది కాదు.

మనవాళ్లకీ అతని దర్శకత్వంలో నటించాలని చాలా కాలంగా ఉంది. నిజానికి 'నేను దేవుడ్ని' చిత్రాన్ని తెలుగులో ప్రభాస్‌తోనే తీస్తానని బాలా చెప్పాడు. అయితే ఆ సినిమాని ఆర్యతోనే సరిపెట్టేశాడు. అతను తీసిన సినిమాల్లోనే బ్యాడ్‌ ఫిలిం కాబట్టి అదెలాగో తెలుగులో రీమేక్‌ అయి ఉండేది కాదులెండి. అయితే బాలా ప్రత్యేకతని ఆ సినిమా కూడా చాటింది. ప్రస్తుతం తమిళంలోనే తన మార్కు సినిమాలు తీస్తున్న బాలా తెలుగులో డైరెక్టు సినిమా తీయడానికి కసరత్తు చేస్తున్నాడట. తెలుగునాట తనకి ఉన్న క్రేజ్‌ని పెంచుకుని, తద్వారా తన తమిళ సినిమాల మార్కెట్‌ పెంచుకునేందుకు బాలా త్వరలోనే ఓ తెలుగు హీరోతో సినిమా తీస్తానని అంటున్నాడు.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు