గౌతమ్ నంద.. ఏంటా వేరే కారణాలు?

గౌతమ్ నంద.. ఏంటా వేరే కారణాలు?

యాక్షన్ హీరో గోపీచంద్ హిట్టు కొట్టి చాలా కాలం అయిపోయింది. ఎప్పుడో 2014లో వచ్చిన ‘లౌక్యం’తో చివరగా సక్సెస్ రుచి చూశాడతను. ఆ తర్వాత అతడి నుంచి వచ్చిన ఏ సినిమా ఆడలేదు. నిజానికి ‘లౌక్యం’కు ముందు కూడా అతను ఇలాగే ఫ్లాపులతో సతమతం అయ్యాడు. ఆ సినిమా తర్వాత గోపీచంద్ కచ్చితంగా హిట్టు కొడతాడని అందరూ అనుకున్న సినిమా ‘గౌతమ్ నంద’. సంపత్ నంది రూపొందించిన ఈ చిత్రానికి మంచి హైప్ వచ్చింది.

కానీ సినిమా అంచనాల్ని అందుకోలేకపోయింది. టాక్ మరీ బ్యాడ్ ఏమీ కాదు కానీ.. సినిమా అయతే ఆడలేదు. ఐతే ఈ చిత్రం ఆడకపోవడానికి అసలు కారణాలు వేరే అంటున్నాడు గోపీచంద్. తన కెరీర్లో ఇప్పటిదాకా చేసిన ప్రతి సినిమా ఫలితాన్ని తాను ముందుగానే అంచనా వేశానని.. ఐతే ‘గౌతమ్ నంద’ మాత్రం ఆడుతుందని అనుకున్నానని.. కానీ అది ఆడలేదని.. ఆ సినిమా అలా కావడానికి కారణాలు వేరే అని గోపీ అన్నాడు. ఒక సినిమా కథ విన్నపుడు ఒక ఫీలింగ్ వస్తుందని.. షూటింగ్ చేస్తున్నపుడు ఇంకోలా అనిపిస్తుందని.. ఐతే డబ్బింగ్ చెబుతున్నపుడు మాత్రం సినిమా రిజల్ట్ ఏంటన్నది తెలిసిపోతుందని గోపీ చెప్పాడు.

డబ్బింగ్ థియేటర్లలో తాను ప్రతి సినిమా గురించి ఒక అంచనాకు వచ్చానని.. దాదాపుగా అన్ని సినిమాలూ ఆ అంచనాకు తగ్గట్లే ఆడాయని.. కానీ ‘గౌతమ్ నంద’ విషయంలో మాత్రం తన అంచనా తప్పిందని.. ఐతే ఆ సినిమా ఆడకపోవడానికి కారణాలు వేరే అని గోపీ అన్నాడు. మరి ఆ వేరే కారణాలు ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది. ఎవరైనా కావాలనే ఆ సినిమాను తొక్కేశారన్నది గోపీ ఉద్దేశమో ఏంటో మరి? చివరగా ‘పంతం’తో షాక్ తిన్న గోపీ.. త్వరలో శ్రీవాస్ దర్శకత్వంలో ఓ సినిమా మొదలుపెట్టనున్నాడని సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English