ఎడమ కాలితో తన్నిన శ్రీను వైట్ల!

ఎడమ కాలితో తన్నిన శ్రీను వైట్ల!

వరుసగా మూడు భారీ పరాజయాలు ఇచ్చిన దశలో శ్రీను వైట్లకి ఇచ్చిన అడ్వాన్సులని కూడా నిర్మాతలు వెనక్కి తీసేసుకున్నారు. ఆ టైమ్‌లో రవితేజని మెప్పించిన శ్రీను వైట్లకి మైత్రి మూవీ మేకర్స్‌లో సినిమా చేసే అవకాశం వచ్చింది. శ్రీను వైట్ల గతంలో తీసుకున్నంత పారితోషికం ఇచ్చుకోలేమని, ఒక మూడు, నాలుగు కోట్లయితే ఇస్తామని సదరు నిర్మాతలు అతనితో చెప్పారట. అయితే 'అమర్‌ అక్బర్‌ ఆంటొని' పెద్ద హిట్‌ అయిపోతుందనే నమ్మకంతో వున్న శ్రీను వైట్ల తనకి పారితోషికం వద్దని, లాభాల్లో వాటా కావాలని అడిగాడట. అందాక సినిమా చేసినంత కాలం తన ఖర్చులు అవీ చూసుకోమని చెప్పాడట.

పాతిక కోట్ల లోపు బడ్జెట్‌లో సినిమా పూర్తి చేస్తే వాటా ఇవ్వడానికి ఏ అభ్యంతరం లేదని నిర్మాతలు చెప్పారట. చెప్పినట్టుగానే అమర్‌ అక్బర ఆంటొని చిత్రాన్ని తక్కువ రోజుల్లో, తక్కువ బడ్జెట్‌లో శ్రీను వైట్ల పూర్తి చేసాడు. సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘోర పరాజయం పాలయినా కానీ రైట్స్‌ అమ్మేసుకున్న నిర్మాతల వరకు గట్టెక్కగలిగారు. పారితోషికం తీసుకోలేదు కనుక తన వాటా ఇస్తారని శ్రీను వైట్ల ఆశ పడ్డాడు కానీ ఈ ఫలితం తర్వాత అటునుంచి ఇక చిల్లి గవ్వ వచ్చేలా లేదు. దీంతో శుభ్రంగా నాలుగు కోట్ల పారితోషికం తీసుకుని వుంటే పోయేదానికి ఎడమ కాలితో అదృష్టాన్ని తన్నేసుకుని రాని లాభం కోసం ఆశ పడి అన్ని విధాలా నష్టపోయాడు పాపం వైట్ల!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English