ఆ హీరో అడ్రస్‌ లేడేంటి?

ఆ హీరో అడ్రస్‌ లేడేంటి?

ఒక రెండు హిట్లు రాగానే ఇండస్ట్రీ మొత్తం వెనకాల పడి ఆఫర్ల మీద ఆఫర్లు ఇచ్చేస్తుంది. అదే నాలుగు ఫ్లాపులు రాగానే అదే హీరోకి పూర్తిగా మొహం చాటేస్తుంది. ఆరంభంలో వరుస విజయాలతో టాలీవుడ్‌కి ధనుష్‌ అనిపించుకున్న రాజ్‌ తరుణ్‌ ఇప్పుడు చేతిలో ఆఫర్లు లేక ఖాళీగా వున్నాడు. ఖాళీ అయిపోవడం కాదు, అసలు అతను ఎక్కడా కనిపించను కూడా కనిపించడం లేదు. దిల్‌ రాజు బ్యానర్లో లవర్‌ డిజాస్టర్‌ అవడం అతడికి వచ్చే అవకాశాలని కూడా పోగొట్టేసినట్టుంది. దిల్‌ రాజు అంతటోడే విజయాన్ని ఇవ్వలేకపోతే ఇక చిన్నా చితకా నిర్మాతల వల్లేమి అవుతుందన్నట్టు రాజ్‌ తరుణ్‌ని పూర్తిగా ఇగ్నోర్‌ చేస్తున్నారు.

అసలే యువ హీరోల్లో చాలా మంది ఆప్షన్లు వుండడం, ఒక రెండు కోట్లు ఎక్కువైనా మార్కెట్‌ వున్న హీరోతో చేసుకుంటే బెటర్‌ అనిపించడం వల్ల రాజ్‌ తరుణ్‌ ప్రస్తుతం ఖాళీ అయిపోయాడు. రాజ్‌ తరుణ్‌ మాత్రమే కాదు ఇంకా పలువురు యువ హీరోలు అతడిలానే డేంజర్‌ జోన్‌లో వున్నారిపుడు. లాస్ట్‌ ఛాన్స్‌లతో ప్రస్తుతం ఇంకా హోప్‌తో వున్న ఆ హీరోలు త్వరలోనే హిట్టవ్వని పక్షంలో చాలా ప్రమాదంలో పడిపోతారు. ఫ్లాప్స్‌లో వున్నపుడు సొంత నిర్మాణంతో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన నితిన్‌, నాగశౌర్యలా రాజ్‌ తరుణ్‌ కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమైనా ప్లాన్‌ చేస్తున్నాడేమో తెలీదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English