‘2.0’లో ఆమె కూడా ఉందా?

‘2.0’లో ఆమె కూడా ఉందా?

‘2.0’ ఇంకో వారం రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకొచ్చేస్తోంది. దీంతో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన అమీ జాక్సన్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. ఐతే అమీ పాత్రకు సంబంధించి ఇప్పటిదాకా ఎలాంటి విశేషాలూ పంచుకోలేదు చిత్ర బృందం. ట్రైలర్లో కూడా ఆమె పాత్రకు పెద్దగా స్కోపే లేదు. ‘రోబో’లో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాధాన్యం కనిపిస్తుంది. ఐశ్వర్యారాయ్ లాంటి అగ్ర కథానాయికను ఎంచుకోవడం ద్వారా సినిమా రీచ్‌ను పెంచాడు శంకర్. ఆమె నటన, అందచందాలు సినిమాకు ప్లస్ అయ్యాయి. కథలో కూడా కథానాయిక పాత్ర కీలకంగా ఉంటుంది. అందులో ఐష్‌తో పోలిస్తే ఇందులో అమీకి అంత సీన్ ఉన్నట్లుగా కనిపించడం లేదు. హీరోయిన్ ఉండాలంటే ఉండాలి అన్నట్లుగా కనిపిస్తోంది వ్యవహారం.

అసలు మామూలుగానే అమీకి ప్రాధాన్యం లేదేమో అనుకుంటుంటే.. ఇప్పుడు ప్రచారంలో ఉన్న ఒక వార్త నిజమైతే ఆమెకు మరింత ఇబ్బంది తప్పదు. ‘2.0’లో ఐశ్వర్యా రాయ్ కూడా ఉందన్న రూమర్ హల్ చల్ చేస్తోంది. ‘రోబో’కు కొనసాగింపుగా ఇందులో కొన్ని సీన్లుంటాయని.. వాటిలో ఐష్ కనిపిస్తుందని.. ఆ పాత్రను ఒక కొసమెరుపుతో ముగించేస్తారని అంటున్నారు. దీన్ని సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్ లాగా దాచి పెడుతున్నారట. శంకర్, రజనీల మీద ఉన్న అభిమానంతో ఆ కొన్ని సీన్లలో ఐష్ నటించిందట. ఇదే నిజమైతే సినిమాకు కలిసొచ్చే విషయమే. కానీ ఐష్ లాంటి కథానాయిక సినిమాలో ఉంటే ఆ విషయాన్ని దాచి పెట్టడం కంటే ప్రచారంలో ఉపయోగించుకుంటేనే బాగుంటుంది. ఐతే నిజంగా ఐష్ సినిమాలో ఉందా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకం. ‘రోబో’ వచ్చిన ఎనిమిదేళ్లకు.. ఈ నెల 29న ‘2.0’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English