ప్రభాస్ కు కోటి ఫాలోవర్ల

ప్రభాస్ కు కోటి ఫాలోవర్ల

‘బాహుబలి’ రాకముందు ప్రభాస్ తెలుగులో ఒక సగటు స్టార్ హీరో మాత్రమే. అతడి మార్కెట్ రూ.30 కోట్లకు అటు ఇటుగా ఉండేది. కానీ ‘బాహుబలి’తో అతడి రేంజే మారిపోయింది. చాలా హద్దులు చెరిపేసి దేశంలోనే అతి పెద్ద స్టార్లలో ఒకడిగా ఎదిగాడు. తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ‘బాహుబలి’ సక్సెస్‌లో మేజర్ క్రెడిట్ రాజమౌళిదే అయినా.. ప్రభాస్ పాత్ర తక్కువేమీ కాదు. ఈ సినిమా అతడిని ఎక్కడికో తీసుకెళ్లింది. ‘బాహుబలి’తో భారీగా ఫాలోయింగ్ పెంచుకున్న ప్రభాస్.. ఫేస్ బుక్‌లో మరే దక్షిణాది కథానాయకుడికీ సాధ్యం కాని ఘనతను అందుకున్నాడు.

ప్రభాస్‌ సోషల్‌ మీడియాలో అంత యాక్టివ్‌గా ఏమీ ఉండడు. అతడికి ఫేస్‌బుక్‌లో మాత్రమే ఖాతా ఉంది. ట్విటర్‌లో కానీ.. ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ అకౌంట్లు లేవు. ఐతే ప్రభాస్‌ ఫేస్‌బుక్‌ ఫాలోవర్ల సంఖ్య కోటికి చేరుకోవడం విశేషం. ప్రభాస్ ఫేస్‌బుక్‌లో ఎక్కువగా పోస్ట్‌లు పెట్టకపోయినప్పటికీ ఇంత మంది ఫాలోవర్లను సంపాదించుకోవడం విశేషమే. ఇక ప్రభాస్ సినీ కెరీర్ విషయానికొస్తే.. అతను ప్రస్తుతం ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో ‘సాహో’ చిత్రీకరణతో బిజీగా ఉన్నాడు. దీంతోపాటు ‘జిల్’ దర్శకుడు రాధాకృష్ణ కుమార్‌తోనూ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలనూ యువి యువి క్రియేషన్సే నిర్మిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English