ఫ్లాప్‌ అయిందని సిగ్గు పడుతున్న సూపర్‌స్టార్‌

ఫ్లాప్‌ అయిందని సిగ్గు పడుతున్న సూపర్‌స్టార్‌

థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌ విడుదలకి ముందే ఫ్లాప్‌ అని అమీర్‌ ఖాన్‌ ఫిక్స్‌ అయిపోయాడు. అందుకే ప్రమోషన్స్‌లో ఎప్పుడూ చాలా యాక్టివ్‌గా వుండే అమీర్‌ ఖాన్‌ ఈసారి దీనికి సరయిన ప్రచారమే చేయలేదు. ఏదో తూ తూ మంత్రంగా పబ్లిసిటీ కానిచ్చేసి, సినిమా విడుదలయ్యాక ఇక దాని ఊసే ఎత్తకుండా విదేశాలకి వెళ్లిపోయాడు. ఇదిలావుంటే అమీర్‌ ఖాన్‌ చిత్రాలకి చైనాలో లభిస్తోన్న ఆదరణతో 'థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌' చిత్రాన్ని కూడా చైనాలో విడుదల చేయడానికి ఘనమైన ఏర్పాట్లు చేసుకున్నారు. ఏకంగా నూట పది కోట్ల రూపాయలకి రైట్స్‌ తీసుకోవడానికి ఒక సంస్థ ముందుకొచ్చింది.

ప్రచారానికి వస్తానని చెప్పిన అమీర్‌ ఇప్పుడు మొహం చాటేసాడు. ఇండియాలో సినిమా డిజాస్టర్‌ అయిందని తెలిసి సదరు సంస్థ ఇప్పుడు ఎలాంటి అడ్వాన్స్‌ పేమెంట్‌ లేకుండా రెవెన్యూ షేరింగ్‌ మీద రిలీజ్‌ చేసి పెడతానంటోంది. ఇక్కడ ఫ్లాప్‌ అయిన సినిమా చైనాలోను ఫెయిలవ్వాలని లేదు. అలాగని రిస్క్‌ తీసుకోవడానికి వాళ్లు ఇష్టపడడం లేదు. కనీసం అమీర్‌ఖాన్‌ చొరవ తీసుకున్నా ఈ డీల్‌ ఎలాగోలా క్లోజ్‌ అవుతుంది. కానీ ఫ్లాప్‌ అవడంతోనే ఈ చిత్రాన్ని పూర్తిగా త్యజించిన అమీర్‌ ఖాన్‌ ఇక దాని గురించి ప్రస్తావించడానికి కూడా సిగ్గు పడుతున్నాడు. ఇది యష్‌రాజ్‌ సంస్థని మరింత ఇబ్బంది పెడుతోందట. నష్టం తగ్గించుకునే వీలున్నా కానీ అమీర్‌ సహకరించకపోవడం వారికి నచ్చట్లేదు. మరోవైపు ఈ చిత్రంతో నష్టపోయిన బయ్యర్లు నష్ట పరిహారం కావాలని యష్‌రాజ్‌ ఫిలిమ్స్‌పై ఒత్తిడి తెస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English