రామ్-పూరి.. సరైన కాంబినేషనే కానీ!

రామ్-పూరి.. సరైన కాంబినేషనే కానీ!

మొత్తానికి యువ కథానాయకుడు రామ్.. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ జత కట్టబోతున్నట్లు కొంత కాలంగా వస్తున్న ఊహాగానాలు నిజమయ్యేట్లే ఉన్నాయి. తమ మధ్య చర్చలు జరుగుతున్న విషయాన్ని రామ్ ‘హలో గురూ ప్రేమ కోసమే’ ప్రమోషన్లలోనే అంగీకరించాడు.

ఇప్పుడు ఇద్దరి మధ్య అంగీకారం కుదిరిందని.. డిసెంబర్ నుంచే సినిమా సెట్స్ మీదికి వెళ్లబోతోందని వీరి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతోందంటుున్నారు. రామ్ సొంత బేనర్ ‘స్రవంతి మూవీస్’లోనే ఈ చిత్రం తెరకెక్కుతుందని సమాచారం. మొత్తానికి ఈ సినిమా ఓకే అయిపోవడంతో ఇంతకీ రామ్-పూరి కాంబినేషన్ ఎలా ఉంటుంది.. వీళ్లిద్దరూ ఎలాంటి కథతో సినిమా చేస్తారు అనే చర్చ మొదలైపోయింది ఇండస్ట్రీలో.

నిజానికి హీరోగా రామ్ శైలి, అతడి నటన.. కొన్ని క్యారెక్టర్లలో అతను చూపించే యాటిట్యూడ్‌ను దృష్టిలో ఉంచుకుని చూస్తే.. పూరి అతడికి చక్కగా సరిపోయే డైరెక్టర్. రామ్‌లో మంచి ఎనర్జీ ఉంటుంది. కానీ దాన్ని అందరు దర్శకులూ సరిగ్గా ఉపయోగించుకోరు. పూరి దాన్ని సరిగ్గా ఉపయోగించుకుని మంచి క్యారెక్టర్ డిజైన్ చేస్తే అదిరిపోతుందని చెప్పొచ్చు.

సక్సెస్, ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా హీరోలకు తనదైన క్యారెక్టరైజేషన్ ఇవ్వడం ద్వారా పూరి చాలాసార్లు తన ప్రత్యేకత చాటుకున్నాడు. ‘ఇడియట్’లో రవితేజ.. ‘పోకిరి’లో మహేష్.. ‘బుజ్జిగాడు’లో ప్రభాస్.. ‘టెంపర్’లో ఎన్టీఆర్.. ఇలా చాలామంది హీరోలకు ప్రత్యేకమైన క్యారెక్టరైజేషన్లతో పూరి మెప్పించాడు. రామ్‌కు కూడా అలాంటి ఒక స్పెషల్ క్యారెక్టర్ ఇవ్వగలిగితే అతను బాగానే పండించగలడు.

కాకపోతే పూరి ఇప్పుడు ఫామ్‌లో లేడు. ఒకప్పట్లా అతడి క్యారెక్టర్లు పేలట్లేదు. దర్శకుడిగా పూరి ముద్ర కనిపించట్లేదు ఆయన సినిమాల్లో. పూరి ఊపుమీదున్నపుడు రామ్ ఆయనతో జత కడితే కథే వేరుగా ఉండేది. కానీ వరుస డిజాస్టర్లతో పూర్తిగా ఫాం కోల్పోయిన టైంలో అతడితో సినిమా చేస్తుండటమే రామ్ అభిమానుల్ని కలవర పెడుతోంది. మరి పూరి ఈ సినిమాతో అయినా ఫామ్ అందుకుని రామ్‌కు మంచి సినిమా అందిస్తాడేమో చూద్దాం.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English