రజనీకి చిట్టచివరి అవకాశం

రజనీకి చిట్టచివరి అవకాశం

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా వస్తోందంటే దక్షిణాది ప్రేక్షకుల్లో ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. గత సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా తన కొత్త సినిమాకు జనాల్ని ఆకర్షిస్తాడు రజనీ. ఇది ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నదే. ‘2.0’ విషయంలోనూ ప్రేక్షకుల్లో బాగానే ఆసక్తి ఉంది. ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. కానీ గత రెండు దశాబ్దాల్లో రజనీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్న సందర్భాలు చాలా తక్కువ. ‘నరసింహ’.. ‘చంద్రముఖి’.. ‘శివాజీ’.. ‘రోబో’ మాత్రమే ఆడాయి. వీటికి రెండు మూడు రెట్లలో సినిమాలు తుస్సుమన్నాయి. అందులోనూ గత దశాబ్ద కాలంలో రజనీ సక్సెస్ రేట్ బాగా పడిపోయింది. ఒక్క ‘శివాజీ’ మినహా సినిమాలన్నీ దారుణ ఫలితాన్ని చవిచూశాయి.

‘రోబో’ తర్వాత రజనీ సినిమాలపై ఎంత ఎక్కువ అంచనాలు పెట్టుకుంటే.. అంత ఎక్కువగా నిరాశ పరిచాయి. రజనీ సినిమాను నమ్ముకున్న బయ్యర్ల సంగతి చెప్పాల్సిన పని లేదు. సూపర్ స్టార్ సినిమా అంటేనే జూదంగా మారిపోయింది. రజనీ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే వచ్చే లాభాలతో పోలిస్తే.. టాక్ తేడా కొడితే నష్టాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. చివరగా రజనీ నుంచి వచ్చిన ‘కాలా’ బయ్యర్లను నిలువునా ముంచేసింది.

ఈ నేపథ్యంలో ‘2.0’ ఏం చేస్తుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. రజనీ గత సినిమాలతో సంబంధం లేకుండా దీనికి భారీగా బిజినెస్ జరిగింది. తెలుగు హక్కులు ఏకంగా రూ.80 కోట్లకు అమ్మినట్లు వార్తలొస్తున్నాయి. ‘2.0’పై ఎంత అంచనాలున్నప్పటికీ పెట్టుబడి వెనక్కి రావడం అంత సులువు కాదు. ఈ విషయంలో రజనీ ఇప్పటికే చాలా నమ్మకం కోల్పోయాడు. ‘2.0’తో అయినా తన బాక్సాఫీస్ స్టామినా చూపించి బయ్యర్లకు లాభాలు అందించకుంటే రజనీ పూర్తిగా క్రెడిబిలిటీ కోల్పోవడం ఖాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English