తమన్నాని రౌండప్‌ చేసేస్తున్నారు

తమన్నాని రౌండప్‌ చేసేస్తున్నారు

తమిళ చిత్ర రంగంలో నంబర్‌వన్‌ హీరోయిన్‌గా ఎదిగిన తర్వాత తమన్నా తన ఫోకస్‌ తెలుగు సినిమాపైకి మరల్చింది. తన ఖాతాలో ఎక్కువ హిట్స్‌ లేకపోయినా కానీ మాస్‌ ఆడియన్స్‌ మెచ్చిన హీరోయిన్‌ అయింది. అందాల ప్రదర్శనతో వరుసగా రచ్చ, రెబల్‌, కెమెరామెన్‌ గంగతో రాంబాబు, తడాఖా తదితర చిత్రాలతో తమన్నా టాప్‌ హీరోయిన్‌ అయింది.

బాలీవుడ్‌లో ఆమె నటించిన హిమ్మత్‌వాలా ఫ్లాపయినా కానీ తమన్నాకి మాత్రం మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. దీంతో తమన్నాకి పలువురు అగ్ర హీరోల నుంచి ఆఫర్స్‌ వస్తున్నాయట. టాప్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ల నుంచి మల్టిపుల్‌ ఫిలింస్‌ డీల్స్‌ కూడా వస్తున్నాయట. ఇంకా తమన్నా తన తదుపరి హిందీ చిత్రం సైన్‌ చేయలేదు కానీ ఓ భారీ చిత్రంలో నటించే అవకాశముందని తెలిసింది. మొత్తానికి తమన్నాని తిరిగి దక్షిణాదికి రానిచ్చేలా లేరు.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు