ఈ 'పోర్న్‌' ఇక్కడ సేల్‌ అవుతుందా?

ఈ 'పోర్న్‌' ఇక్కడ సేల్‌ అవుతుందా?

'నాట్‌ ఏ పోర్న్‌ స్టార్‌' అని ట్యాగ్‌ పెట్టారు కానీ 'షకీలా' బయోపిక్‌ అంటే సాఫ్ట్‌ పోర్న్‌ సీన్లు లేకుండా ఎలా? షకీలా జీవితంపై సినిమా అనేది కమర్షియల్‌గా మంచి మైలేజ్‌ వున్న సబ్జెక్టు. అయితే ఈ షకీలాకి మాత్రం అంతా రాంగ్‌ ప్యాకేజింగ్‌ అనిపిస్తోంది. సిల్క్‌ స్మిత జీవితాన్ని సినిమాగా తీసినపుడు లీడ్‌ రోల్‌లో విద్యాబాలన్‌ని పెట్టడం నుంచి 'ది డర్టీ పిక్చర్‌' అనే టైటిల్‌ వరకు అన్నిట్లోను జనాన్ని విపరీతంగా ఆకర్షించగలిగారు.

అంతకుముందు వరకు సాంప్రదాయబద్ధమైన పాత్రల్లో కనిపించిన విద్యాబాలన్‌ ఒక్కసారిగా రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేస్తే జనం ఆ వింత చూడ్డానికి ఎగబడిపోయారు. షకీలా పాత్రకి రిచా చడ్డాని ఎంచుకోవడంతోనే మొదటి మిస్టేక్‌ జరిగింది. రిచా చడ్డా మంచి నటి అనే దాంట్లో సందేహాలు లేవు కానీ షకీలా అనగానే గుర్తొచ్చే రూపానికి తగ్గట్టు అయితే ఆమె లేదనే చెప్పాలి. షకీలా ఫస్ట్‌ పోస్టర్‌ చాలా సంచలనాత్మకంగా వుంటుందని భావిస్తే అది కూడా నీరుగార్చేసింది.

ఈ చిత్రాన్ని హిందీ మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకుని తీస్తున్నారనేది అర్థమవుతోంది. కానీ సౌత్‌ ఇండియాని ఒక ఊపు ఊపిన షకీలా కథకి ఇక్కడ కూడా కోట్లు రాబట్టే సత్తా వుంది. కానీ ఇలాంటి ప్యాకేజింగ్‌తో ఇక్కడి వారిని ఆకట్టుకోవడం కష్టమవుతుంది కనుక ఇకనైనా మేలుకుని షకీలా బ్రాండ్‌కి తగ్గట్టు రీసౌండ్‌ వచ్చేలా అదరగొట్టాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English