బన్నీతో ఆ సినిమా ఏంటి బాసూ..

బన్నీతో ఆ సినిమా ఏంటి బాసూ..

ప్రతి హీరోకూ ఒక ఇమేజ్ ఉంటుంది. దానికి భిన్నంగా అప్పుడప్పుడూ కొన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. ఐతే కొత్తదనం కోసమని ఇమేజ్‌ నుంచి మరీ దూరంగా వెళ్లిపోయి.. సరిపడని కథలు ట్రై చేస్తే మొదటికే మోసం వచ్చేస్తుంది. ఇందుకు టాలీవుడ్లో కొన్ని ఉదాహరణలు కనిపిస్తాయి. తాజాగా అల్లు అర్జున్ చేస్తాడంటూ ప్రచారం జరుగుతున్న ఓ రీమేక్ మూవీ గురించి తెలిసి జనాలు ఆశ్చర్యపోతున్నారు.


తమిళంలో గత నెలలో విడుదలై మంచి విజయం సాధించిన ‘96’ సినిమాను తెలుగులో బన్నీ హీరోగా రీమేక్ చేస్తారని ఓ ప్రచారం నడుస్తోందిప్పుడు. కానీ బన్నీ ఇమేజ్‌కు ఇది ఎంత మాత్రం తగని సినిమా. తమిళంలో హీరోగా విజయ్ సేతుపతి నటించాడు. అతడి ఇమేజ్ వేరు. అతనెంచుకునే పాత్రలు వేరు. ఒక సినిమాకు ఇంకో సినిమాకు సంబంధం ఉండదు. విజయ్‌ని హీరోలా కాకుండా నటుడిలానే చూస్తారు జనాలు. అతను ఎలాంటి పాత్రలో అయినా సులువుగా ఒదిగిపోతాడు. ఇమేజ్ అడ్డంకులేమీ ఉండవు. మొదట్నుంచి అతడి దారి అదే.

‘96’ సినిమా విషయానికి వస్తే.. అందులో విజయ్‌ది ఒక ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ పాత్ర. స్కూల్ టైంలో విడిపోయిన తన ప్రేయసిని 20 ఏళ్ల తర్వాత కలిసినపుడు పరిణామాలు ఎలా ఉంటాయో ఇందులో చూపిస్తారు. సినిమా పూర్తి క్లాస్‌గా ఉంటుంది. సినిమాలో సగం ఎపిసోడ్ స్కూల్ పిల్లలదే ఉంటుంది. ఎక్కడా హీరోయిజంకు అవకాశముండదు. బన్నీ మార్కు వినోదానికి కూడా స్కోప్ తక్కువ. పూర్తిగా ఎమోషన్ల మీద నడిచే ఫీల్ గుడ్ మూవీ ఇది. ఇలాంటి సినిమా బన్నీకి సెట్టవడం కష్టం. అతడి నుంచి అభిమానులు ఆశించే అంశాలు వేరు. ఈ సినిమా తీరు వేరు.

మరి ఇలాంటి సినిమా మీద బన్నీ ఆసక్తి చూపిస్తున్నాడంటే వినడానికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. సినిమా చూసిన ఎవ్వరూ కూడా ఇందులో బన్నీ ఫిట్ అవుతాడని అనుకోరు. అలాంటిది బన్నీకో.. నిర్మాత దిల్ రాజుకో ఇలాంటి ఆలోచన రాకుండా ఉండదు. అలాంటపుడు ఈ సినిమా బన్నీ చేస్తాడని రూమర్లు ఎందుకొస్తున్నాయో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English