చిన్న సినిమా చితగ్గొట్టేసింది

చిన్న సినిమా చితగ్గొట్టేసింది

బాలీవుడ్లో భారీ సినిమాలన్నీ బోల్తా కొట్టేస్తుంటే చిన్న సినిమాలు హవా సాగిస్తున్నాయి. గత రెండు మూడేళ్లలో చిన్న సినిమాలే పెద్ద విజయాలు సాధించాయి. ఈ ఏడాది లో బడ్జెట్ సినిమాలే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి. పేరు లేని హీరో హీరోయిన్లు నటించిన 'సోనీ కే టిటు కీ స్వీటీ' అనే చిన్న సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ఇక ఈ మధ్యే 'అందాదున్' అనే మరో చిన్న చిత్రం సంచలన వసూళ్లు రాబట్టింది.

ఈ చిత్రంలో కథానాయకుడైన ఆయుష్మాన్ ఖురానా నటించిన కొత్త సినిమా 'బడాయి హో' నెల రోజులుగా అదరగొడుతోంది. ఈ చిత్రం ఇప్పటిదాకా రూ.125 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం. ఇందులో తల్లి.. భార్య ఒకేసారి గర్భవతులవుతారు. ఈ నేపథ్యంలో కామెడీ భలేగా పండించారు.

ట్రైలర్‌తోనే ఈ చిత్రం ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షించింది. సినిమా అంచనాలకు తగ్గట్లే ఉండటంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తొలి రెండు వారాల్లో భారీ వసూళ్లతో వంద కోట్ల మార్కును టచ్ చేసిందీ చిత్రం. ఐతే ఆమిర్ ఖాన్ సినిమా 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' రాకతో ఈ సినిమా కథ ముగిసిందని అనుకున్నారు. చాలా వరకు దీనికి స్క్రీన్లు కూడా తగ్గించేశారు. కానీ ఆ చిత్రం డిజాస్టర్ కావడంతో మళ్లీ ప్రేక్షకులకు ఈ సినిమానే ఛాయిస్ అయింది.

'థగ్స్..'కి ముందు వెనుక వచ్చిన సినిమాలేవీ కూడా ఆకట్టుకోలేదు. దీంతో విడుదలైన నెల రోజుల తర్వాత కూడా ఈ చిత్రం మంచి వసూళ్లతో సాగింది. అంచనాల్ని మించిపోయి రూ.125 కోట్ల మార్కును అందుకుంది. పెట్టుబడి-రాబడి కోణంలో చూస్తే ఈ ఏడాది ఇదే బిగ్గెస్ట్ హిట్ అని ట్రేడ్ పండితులు అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English