ఆ బ్లాక్‌బస్టర్లేంటి.. ఈ డిజాస్టర్లేంటి?

ఆ బ్లాక్‌బస్టర్లేంటి.. ఈ డిజాస్టర్లేంటి?

ఓడలు బళ్ళు.. బళ్ళు ఓడలు అవడానికి సినిమా ఇండస్ట్రీలో ఒక్క శుక్రవారం చాలంటారు. ఈ వేసవిలో రంగస్థలం చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్నపుడు, వరుసగా మూడు విజయాలతో మైత్రి మూవీ మేకర్స్‌ని కొట్టే సంస్థ లేదనిపించింది. వారి అదృష్టానికి మిగతా చిత్ర పరిశ్రమ అసూయ పడింది. స్టార్‌ హీరోలు అందరూ ఈ బ్యానర్లో ఒక సినిమా చేయాలనుకునేంతగా పాపులర్‌ అయిపోయింది. అయితే ఆ హిట్టు రికార్డు రెండు వారాల వ్యవధిలో మరుగున పడి, మైత్రి మూవీ మేకర్స్‌ కూడా అన్ని సంస్థల్లానే అన్నట్టయింది. వరుసగా మూడు పెద్ద హిట్లు ఇచ్చిన ఈ సంస్థ రెండు వారాల వ్యవధిలో రెండు పెద్ద డిజాస్టర్లని చవిచూసింది.

మొదటి దెబ్బ సవ్యసాచితో తగిలితే, రెండవ గాయాన్ని అమర్‌ అక్బర్‌ ఆంటొని చేసింది. రెండు సినిమాలు కూడా బయ్యర్లకి తీవ్ర నష్టాలు మిగిల్చినవే కావడంతో మైత్రి ట్రాక్‌ రికార్డ్‌ బాగా ఎఫెక్ట్‌ అయింది. సడన్‌గా పెద్ద సినిమాలు పక్కన పెట్టి, మీడియం బడ్జెట్‌ సినిమాలు మొదలు పెట్టిన మైత్రి మూవీస్‌ నుంచి తదుపరి వచ్చే చిత్రం 'చిత్రలహరి'. అసలే ఫ్లాపుల్లో వున్న సాయి ధరమ్‌ తేజ్‌ హీరో కావడంతో ఈ రెండు ఫ్లాపుల తర్వాత అనుమానాలు ఇంకా పెరుగుతున్నాయి. భారీ చిత్రాలతో ప్రయాణం మొదలు పెట్టి, చిన్న సినిమాలని కూడా నిర్మిస్తూ బిజీగా వుండాలనే ప్రయత్నం బెడిసికొట్టింది. మరి ఈ ఫాల్‌ నుంచి తిరిగి ఎలా పైకి లేస్తారనేది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English