అది దాటి రాలేకపోతున్న త్రివిక్రమ్‌

అది దాటి రాలేకపోతున్న త్రివిక్రమ్‌

హీరోలకి హోమ్‌ బ్యానర్లుంటాయి కానీ దర్శకులు, అందునా ఈ తరం దర్శకులు హోమ్‌ బ్యానర్లు మెయింటైన్‌ చేయరు. ఎవరు ఎక్కువ పే చేస్తే వారికి సినిమా చేసి పెట్టడమే ఎవరైనా చేస్తారు. కానీ త్రివిక్రమ్‌ మాత్రం కొంతకాలంగా హారిక హాసిని సంస్థకి కట్టుబడిపోయాడు. ఇంతవరకు ఆ సంస్థ పేరుపై తీసిన సినిమాలన్నీ త్రివిక్రమ్‌ డైరెక్ట్‌ చేసినవే. ఈ సంస్థలో త్రివిక్రమ్‌ దర్శకుడే అయినా కానీ అందరూ అతని మాట వినాల్సిందేనట.

ఆయనకి నచ్చింది చేస్తాడే తప్ప ఎవరూ క్వశ్చన్‌ చేసే వాళ్లే వుండరట. అంతగా ఆ కంఫర్ట్స్‌కి, లిబర్టీకి అలవాటు పడిపోవడంతో ఇప్పుడు వేరే బ్యానర్లో చేయాలన్న ఆలోచన కూడా త్రివిక్రమ్‌ మైండ్‌లోకి రానివ్వడం లేదట. తనకి అడ్వాన్సులు ఇచ్చిన కొందరు నిర్మాతలకి కూడా హారిక హాసిని అధినేత రాధాకృష్ణతో ఆ డబ్బులు చెల్లించేసి వీరికే ఆ సినిమాలు చేద్దామని అనుకుంటున్నాడట. అల్లు అర్జున్‌తో సినిమాని గీతా ఆర్ట్స్‌పై చేయాలని అరవింద్‌ పట్టుబడుతోంటే, హారిక హాసినితో కలిసి అయితేనే చేద్దామని త్రివిక్రమ్‌ పంతం పట్టడం వల్లే అది ఇంకా ముందుకి కదలడం లేదని భోగట్టా. ఇంతగా ఒక బ్యానర్‌కి అలవాటు పడిపోయిన త్రివిక్రమ్‌ రేపు వాళ్లతో ఎంచేత అయినా చెడితే అప్పుడేమి చేస్తాడో? అసలే సినిమా ఇండస్ట్రీలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు వుండరంటారాయె.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English