చిరంజీవితో త్రివిక్రమ్‌ పక్కా

చిరంజీవితో త్రివిక్రమ్‌ పక్కా

మెగాస్టార్‌ చిరంజీవి అరవయ్యేళ్లు దాటిన తర్వాత రీఎంట్రీ ఇస్తోంటే ఇప్పుడాయనతో సినిమాలు ఎవరు తీస్తారని అనుకున్నారు. కానీ ఖైదీ నంబర్‌ 150తో వంద కోట్లకి పైగా షేర్‌ సాధించి బాక్సాఫీస్‌ విషయంలో తానెప్పటికీ షేర్‌ అని చిరు నిరూపించుకున్నారు. ఇక చిరంజీవితో 'సైరా నరసింహారెడ్డి' తీయడానికి ఇదే సరయిన సమయమని భావించి, చరణ్‌ ఆ బృహత్తర ప్రాజెక్ట్‌ని లాంఛ్‌ చేసాడు. చిరంజీవి సోలో పాత్రల నుంచి రిటైర్‌ అయ్యే ముందు సైరా చేస్తున్నారని కామెంట్‌ చేసారు. సైరా ఇంకా నిర్మాణంలో వుండగానే హాట్‌షాట్‌ దర్శకుడు కొరటాల శివ మిగతా యువ హీరోలని కాదనుకుని మెగాస్టార్‌ చిరంజీవితో సినిమా చేస్తానంటూ ఆయనకి కథ చెప్పారు.

త్వరలోనే ఆ చిత్రం సెట్స్‌ మీదకి వెళ్లనుంది. తాజా వార్త ఏమిటంటే మరో అగ్ర దర్శకుడు త్రివిక్రమ్‌ కూడా చిరంజీవికి ఒక లైన్‌ వినిపిస్తే దానికి మెగాస్టార్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. కాకపోతే కొరటాల సినిమా పూర్తయిన తర్వాతే ఇది మొదలవుతుందని భోగట్టా. ఈలోగా అల్లు అర్జున్‌ చిత్రాన్ని త్రివిక్రమ్‌ పూర్తి చేస్తాడు. అంటే వచ్చే యేడాది చివర్లో లేదా 2020 ఆరంభంలో ఈ కాంబినేషన్‌లో సినిమా మొదలు కావచ్చు. అగ్ర దర్శకులంతా ఇలా చిరంజీవి వెంట పడుతూ వుంటే యువ హీరోలకి ఇక ఏ డైరెక్టర్లు దొరుకుతారో కదూ!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English