డిజాస్టర్‌తో ఎగ్జిట్‌, డిజాస్టర్‌తో రీఎంట్రీ

డిజాస్టర్‌తో ఎగ్జిట్‌, డిజాస్టర్‌తో రీఎంట్రీ

తెలుగు చిత్ర సీమ నుంచి వెళ్లిపోయే ముందు 'దేవుడు చేసిన మనుషులు' చిత్రంతో ఘోరమైన పరాజయాన్ని చూవిచూసి వెళ్లిన ఇలియానా ఇప్పుడు మళ్లీ అదే హీరోతో 'అమర్‌ అక్బర్‌ ఆంటొని'తో రీఎంట్రీ ఇచ్చింది. ఆరేళ్ల తర్వాత తిరిగి వచ్చిన ఇలియానాకి రీఎంట్రీలోను రిజల్ట్‌ మారలేదు. మళ్లీ డిజాస్టర్‌తోనే తిరిగి వచ్చిన ఇలియానాకి ఈ చిత్రంతో బాగానే గిట్టుబాటు అయింది. కోటిన్నర పారితోషికానికి తోడు ఇతర అవసరాలన్నీ నిర్మాతలే తీర్చారు. ఆమెకిపుడు స్టార్‌ స్టేటస్‌ లేకపోయినా స్టార్‌లానే ట్రీట్‌ చేసారు.

విచిత్రంగా రవితేజతో కెరియర్‌ బిగినింగ్‌లో హిట్లు తీసిన పూరి 'దేవుడు చేసిన మనుషులు' తీసినట్టే, రవితేజతో హిట్లు ఇచ్చిన శ్రీను వైట్ల 'అమర్‌ అక్బర్‌ ఆంటొని' లాంటి తల తోక చిత్రం చేసాడు. ఈ దర్శకులిద్దరూ ఇలియానానే ఎంచుకున్నారు. ఈ చిత్రంతో తిరిగి తెలుగు చిత్ర సీమలో బిజీ అవుతానని ఆశించిన ఇలియానా ప్లాన్‌ ఫలించలేదు. బాలీవుడ్‌లో ఇప్పటికే అవకాశాలు తగ్గిపోగా, మునుపటి సెక్సీ ఫిగర్‌ని కూడా మెయింటైన్‌ చేయకుండా లావైపోయిన ఇలియానా ఇక ఎంతో దూరం వెళ్లేటట్టు లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English