నాటి కష్టాలతో పోలిస్తే ఇవెంత-దేవరకొండ

నాటి కష్టాలతో పోలిస్తే ఇవెంత-దేవరకొండ

విజయ్ దేవరకొండ ఇప్పుడు మామూలు టెన్షన్లో లేడు. ‘నోటా’ డిజాస్టర్ అయ్యాక అతడి నుంచి వస్తున్న ‘ట్యాక్సీవాలా’ రిజల్ట్ ఏమవుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. ఈ చిత్రం ముందే ఆన్ లైన్లో లీక్ అయిపోవడం.. దీని ట్రైలర్ చూశాక సినిమా ఎలా ఉంటుందో అన్న సందేహాలు కలగడమే విజయ్‌లో టెన్షన్‌కు కారణం. ముఖ్యంగా పైరసీ ప్రభావం సినిమా మీద పడుతుందేమో అని విజయ్ ప్రెజర్ ఫీలవుతున్నాడు.

కెరీర్లో ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని.. ఇంత టెన్షన్ పడాల్సి ఉంటుందని భావించారా అని అతడిని మీడియా వాళ్లు అడిగితే.. ఇదంతా ఒక కష్టమా అని అతను ఎదురు ప్రశ్నించాడు. ఐదారేళ్ల ముందు తన పరిస్థితి తలుచుకుంటే ఇదంతా అసలు తనకు సమస్యలాగే అనిపించట్లేదని విజయ్ అన్నాడు.

‘‘ఈ మధ్య కాకినాడకు వెళ్తే నా స్నేహితులు కలిశారు. 2012-13 నాటి వీడియోలు చూపించారు. వాటిలో నన్ను నేను చూస్తుంటే గుర్తుపట్టలేకపోతున్నా. అప్పుడు కెరీర్ చాలా టెన్షన్లో ఉండేది. డబ్బుల గురించి టెన్షన్ ఉండేది. ఆ వీడియోల్లో అందరూ నవ్వుతుంటే నేను మాత్రం ఆలోచనలో ఉన్నా. అప్పుడు రెస్టారెంటుకు వెళ్తే చాలా ఇబ్బందిగా ఉండేది. నేను ఐటెమ్స్ ఆర్డర్ చేసేవాడిని. కానీ నేను బిల్లు కట్టేవాడిని కాదు. అది చాలా ఇబ్బందికరమైన ఫీలింగ్. అప్పట్లో అసలు నేను సినిమాల్లో ఉంటానో లేదో అని టెన్షన్. అలాంటి కష్టాలతో పోలిస్తే ఇప్పటి పరిస్థితులు ఎంతో బెటర్ కదా. ఇప్పుడు నేను చేసిన సినిమా కొంచెం అటు ఇటు అయినా నన్ను.. నా టీంను రక్షించే పొజిషన్ ఉంది.  నన్ను ఆరాధించే వ్యక్తులు ఉన్నారు. అవన్నీ చాలా సంతోషంగా అనిపించే విషయాలు’’ అని విజయ్ అన్నాడు. ‘ట్యాక్సీవాలా’ పైరసీ తనను బాధపెట్టినప్పటికీ.. ఈ సినిమా ఫలితం విషయంలో ఎలాంటి ఆందోళనా లేదని.. ఇది కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని విజయ్ చెప్పాడు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English