మళ్ళీ శ్రీదేవి కోసం రాజమౌళి ట్రయిల్స్

మళ్ళీ శ్రీదేవి కోసం రాజమౌళి ట్రయిల్స్

ఎందుకో జక్కన్న రాజమౌళికి దివంగత హీరోయిన్ శ్రీదేవి అంటే చాలా అభిమానం. చాలామంది సీనియర్లకు ఆమె గ్లామర్ అన్నా అభినయం అన్నా చాలా క్రేజ్ అనుకోండి.. అయితే రాజమౌళి మాత్రం ఇంకా శ్రీదేవి గురించి అలోచిస్తూనే ఉన్నాడు. మరి ఈ అతిలోకసుందరి ప్రపంచాన్ని వదిలేసి వెళ్లిపోయిందిగా.. ఇప్పుడు ఈమె గురించి ఆలోచించి ఉపయోగం ఏంటో?

విషయం ఏంటంటే.. గతంలో బాహుబలి సినిమాలో శివగామి పాత్రకు శ్రీదేవిని తీసుకుందాం అనుకున్న రాజమౌళి.. ఇప్పుడు జూనియర్ శ్రీదేవిని #RRR సినిమా కోసం తీసుకోవాలి అనుకుంటున్నాడట. కాని అప్పటలో శ్రీదేవి ఎక్కువ డిమాండ్ చేయడంతో.. శివగామి పాత్రకుగాను ఆమెను తీసుకోలేదు. అయితే ఇప్పుడు మాత్రం.. #RRRలో ఎన్టీఆర్ లేదా చరణ్‌ ప్రక్కన శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి కపూర్ ను హీరోయిన్ గా తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడట మన దిగ్గజదర్శకుడు. కాని అప్పట్లో శ్రీదేవి కోసం చాలా ఎక్కువ పైకం కోట్ చేసిన ఆమె భర్త బోనీ కపూర్.. ఇప్పుడు కూతురు జాన్వి కోసం కూడా అదే రేంజులో కోట్ చేయడా? అదే ఇప్పుడు తేలాల్సిన విషయం.

ఎందుకోగాని రాజమౌళి మొదటినుండి #RRR సినిమాకోసం హీరోయిన్లుగా బాలీవుడ్ స్టారీమణులనే తీసుకోవాలని చూస్తున్నాడు. చూస్తుంటే అప్పట్లో ప్రభాస్ ను ఎలాగైతే బాలీవుడ్ లో కూడా స్టార్ ను చేసేశాడో.. ఇప్పుడు చరణ్‌ అండ్ ఎన్టీఆర్ లను కూడా బాలీవుడ్ లో పెద్ద హీరోలను చేయాలనే ప్లాన్ తో ఉన్నట్లున్నాడు. అందుకే అక్కడి భామలను తీసుకుంటే.. హిందీ వర్షెన్ సినిమా రిలీజ్ కు ఎక్కువ మైలేజీ ఉంటుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English