ఇది కొట్టాడంటే దేవరకొండ రేంజే వేరు

ఇది కొట్టాడంటే దేవరకొండ రేంజే వేరు

విజయ్ దేవరకొండ కొత్త సినిమా టాక్సీవాలా రేపే రిలీజ్ అవుతోంది. ఈ సినిమాతో కలిపి అప్పుడే ఈ ఏడాదికి మనోడు మూడు సినిమాలను దించాడు. ఇంకో సినిమా రాకపోవచ్చు కాని.. అసలు ఏడాదిలో మూడు రిలీజ్ లు అంటే మాత్రం ఈ తరం హీరోల్లో మనోడు చాలా ఫాస్ట్ అని చెప్పాలి. ఏకంగా నాని వంటి హీరోలు కూడా రెండు సినిమాలే చేయగలుగుతున్న టైములో.. విజయ్ మాత్రం దూసుకుపోతున్నాడు.

అయితే సినిమా సినిమాకూ తన బాక్సాఫీస్ రేంజును పెంచుకుంటూ పోతేనే ఏ హీరో అయినా కూడా అసలు సిసలైన బాక్సాఫీస్ మొనగాడు అవుతాడు. అలా రేంజ్ పెరిగాక ఫ్లాప్ వచ్చినా కూడా.. సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన డబ్బులో ఒక 70% రికవర్ అయిపోతుంది.  ఇప్పుడు విజయ్ దేవరకొండ విషయానికొస్తే.. అర్జున్ రెడ్డి తరువాత వచ్చిన గీతా గోవిందం సినిమాతో ఏకంగా 66+ కోట్ల షేర్ కలక్షన్ రాబట్టాడు. కాని నోటా విషయంలో మాత్రం రిజల్ట్ రివర్స్ అయిపోయింది. ఒకవేళ ఇప్పుడు టాక్సీవాలాతో కూడా హిట్టు కొట్టి ఒక 40 కోట్ల ప్లస్ వసూళ్ళు రాబడితే మాత్రం.. మనోడు హీరోగా కొత్త రేంజుకి వచ్చేసినట్లే.

ఎన్నో ఏళ్ళు వరుసగా హిట్టు సినిమాలు తీశాక.. నాని ఒక్కడే ప్రస్తుతం ఈ 40 మార్కుకు దగ్గరగా రాగలుగుతున్నాడు. పెద్ద స్టార్లందరూ 80 పైన ఉంటే.. మిగతా హీరోలందరూ 25 కోట్ల మార్క్ కిందే ఉన్నారు. అందుకే ఇప్పుడు దేవరకొండ ఏమవుతాడా అని అందరూ ఎదరుచూస్తున్నారు. చూద్దాం.. టాక్సీవాలాగా వచ్చి బాక్సాఫీస్ వాలాగా మారతాడో లేదో!!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English