కొత్త సినిమా.. లబ్ డబ్ లబ్ డబ్

కొత్త సినిమా.. లబ్ డబ్ లబ్ డబ్

మళ్లీ శుక్రవారం వచ్చేసింది. ఇంకో కొత్త సినిమా ప్రేక్షకుల తీర్పు కోసం సిద్ధమైంది. ఈ వారం వస్తున్న ‘అమర్ అక్బర్ ఆంటోని’ ఆ చిత్ర బృందానికి అత్యంత కీలకం. ఈ సినిమాపై చాలామంది చాలా ఆశలతో ఉన్నారు. ముఖ్యంగా హీరో హీరోయిన్లు.. దర్శకుడు.. నిర్మాతలు.. ఇలా అందరికీ ‘అమర్ అక్బర్ ఆంటోని’ ఫలితంపై ఉత్కంఠ నెలకొంది.

మాస్ రాజా రవితేజ హిట్టు రుచి చూసి చాలా కాలం అయిపోయింది. అందులోనూ ఈ ఏడాది అతడి నుంచి వచ్చిన ‘టచ్ చేసి చూడు’.. ‘నేల టిక్కెట్టు’ ఒకదాన్ని మించి ఇంకోటి డిజాస్టర్లయ్యాయి. దీంతో అతడికిప్పుడు హిట్టు చాలా చాలా అవసరం. మరోవైపు దర్శకుడు శ్రీను వైట్ల పరిస్థితి చెప్పాల్సిన పని లేదు. హ్యాట్రిక్ డిజాస్టర్లతో దర్శకుడిగా అనూహ్య పతనం చవిచూశాడు. అతను మళ్లీ కోలుకోవడం కష్టమే అని అందరూ అనుకోగా.. అనుకోకుండా ‘అమర్ అక్బర్ ఆంటోని’ లాంటి పెద్ద ప్రాజెక్టు దక్కింది.

దీంతో అతను రుజువు చేసుకోకుంటే చాలా చాలా కష్టం. ఇక హీరోయిన్ ఇలియానా.. టాలీవుడ్ కెరీర్ క్లోజ్ అనుకుంటుండగా ఈ చిత్రంలో అవకాశం వచ్చింది. ఆమె రీఎంట్రీకి ఈ సినిమా చాలా కీలకం. ఇక హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లతో సత్తా చాటిన మైత్రీ మూవీస్ అధినేతలకు ‘సవ్యసాచి’ షాకిచ్చింది. వాళ్లూ ఈ చిత్రంపై చాలా ఆశలతో ఉన్నారు.

ఇలా ఇంతమంది ‘అమర్ అక్బర్ ఆంటోని’ ఫలితం కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఆడకుంటే అందరికీ ఇబ్బందే. ఈ సినిమా ప్రోమోలు చూస్తే సగటు రివెంజ్ స్టోరీలా కనిపించింది. ఏమంత కొత్తదనం ఉన్నట్లు అనిపించలేదు. ఈ తరహా సినిమాలు ఇప్పుడు ఆడతాయా అన్న సందేహాలున్నాయి. కానీ వైట్ల మాత్రం ఈసారి తాను హిట్టు కొడతానని నమ్మకంగా చెప్పాడు. చూద్దాం మరి ఏమవుతుందో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English