బయ్యర్లు నిలువునా మునిగిపోయారు

బయ్యర్లు నిలువునా మునిగిపోయారు

ఆమిర్ ఖాన్ సినిమా అంటే ప్రేక్షకులు ఎలా కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోతారో.. బయ్యర్లు కూడా అంతే నమ్మకంతో పెట్టుబడి పెట్టేస్తుంటారు. ఫ్యాన్సీ రేట్లకు సినిమాను కొనేస్తుంటారు. గత దశాబ్దంన్నర కాలంలో ఆమిర్ సక్సెస్ రేట్ అలా ఉంది మరి. సినిమా సినిమాకు తన క్రెడిబిలిటీని పెంచుకుంటూ తిరుగులేని స్థాయిని అందుకున్నాడు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్.

ఆమిర్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో.. అత్యధిక అంచనాలతో వచ్చిన ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ను కూడా భారీ రేట్లకే కొన్నారు బయ్యర్లు. ఈ చిత్ర బడ్జెట్ రూ.260 కోట్లు కాగా.. ఇండియా హక్కులే రూ.200 కోట్ల దాకా తెచ్చిపెట్టాయి. ఐతే అయినకాడికి రేట్లు పెట్టి సినిమాను కొన్న బయ్యర్లు ఇప్పుడు లబోదిబో అంటున్నారు. సినిమాకు టాక్ ఎలా ఉన్నా ఓపెనింగ్స్‌తోనే గట్టెక్కేస్తామని ఆశించిన డిస్ట్రిబ్యూటర్లకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది.

తొలి రోజు రూ.50 కోట్ల దాకా గ్రాస్ రాబట్టిన ఈ చిత్రం.. ఆ తర్వాత దబేల్‌మని పడింది. ఆపై లేవనే లేదు. ఇప్పటిదాకా ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ దేశవ్యాప్తంగా రూ.130 కోట్లు మాత్రమే గ్రాస్ వసూలు చేయడం గమనార్హం. అంటే షేర్ అందులో 60 శాతం మాత్రమే ఉంటుంది. సినిమా ఫుల్ రన్లో బయ్యర్ల పెట్టుబడిలో మూడో వంతు మాత్రమే వెనక్కి వచ్చేలా కనిపిస్తోంది. ఇక వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

నిర్మాతలు డబ్బులు వెనక్కి ఇవ్వకుంటే బయ్యర్లు నిండా మునిగినట్లే. ఈ చిత్రాన్ని తెలుగు.. తమిళ భాషల్లో సైతం రిలీజ్ చేశారు. అక్కడ వసూళ్లు రిలీజ్ ఖర్చులకే సరిపోయేలా ఉన్నాయి. ఎంతైనా అవి చిన్న మొత్తాలే కాబట్టి పర్వాలేదు. కానీ హిందీ వెర్షన్ కొన్న వాళ్ల పరిస్థితి మాత్రం అయోమయంగా ఉంది. ఆమిర్‌ ఖాన్‌ను నమ్మి ఈ స్థాయిలో దెబ్బ తినడం ఇంతకుముందెన్నడూ జరగలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English