రాజమౌళి గారూ... ఫాన్స్‌ హర్టవుతున్నారు

రాజమౌళి గారూ... ఫాన్స్‌ హర్టవుతున్నారు

ఇప్పుడు రాజమౌళి చెప్పిందే వేదం కావచ్చు. అతడిని ఏమి చేస్తున్నావని అడిగేంత రేంజి ఎవరికీ లేకపోవచ్చు. మీడియాని కూడా ఆయన తృణప్రాయంగా తీసి పారేయవచ్చు. తనకిప్పుడు తన ట్విట్టర్‌ పేజీ కంటే పెద్ద మీడియా అక్కర్లేదు. ఇదంతా పచ్చి నిజమే అయినా కానీ ఇద్దరు ప్రముఖ హీరోలతో, భారీ ఫాలోయింగ్‌ వున్న వారితో ఒక సినిమా కలిసి తలపెట్టినపుడు వారి అభిమానులకి వుండే ఎమోషన్స్‌, టెన్షన్స్‌ గురించి కూడా కాస్త పట్టించుకోవాలి. రెండేళ్లు సినిమా తీస్తా, తీసినప్పుడు తెర మీద చూసుకోండి అన్నట్టు వ్యవహరిస్తే ఈలోగా వెర్రి అభిమానుల మధ్య యుద్ధాలు జరుగుతుంటాయి.

మీడియా ఎన్ని రకాలుగా రాస్తున్నా కానీ తనకేమీ పట్టనట్టు రాజమౌళి తన పని తాను చూసుకుంటున్నాడు. అసలు తను తీసే సినిమా జోనర్‌ ఏమిటి? ఏ నేపథ్యంలో వుంటుందనే కనీస అవగాహన కూడా కల్పించలేదు. దీంతో మీడియా తన ఊహాశక్తికి పని చెప్పి పుకార్లు పుట్టిస్తోంటే ఆయా హీరోల అభిమానులు ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటూ మా వాడు గొప్ప అంటే మావాడు గొప్ప అంటూ కీబోర్డ్‌ వారియర్స్‌ అయిపోతున్నారు. మీడియా అంటే రాజమౌళికి ఇప్పుడు లెక్క లేకపోవచ్చు. తను మెగాస్టార్ల కంటే పెద్ద రేంజిలో వుండి వుండొచ్చు. కానీ సినీ అభిమానుల వరకు అయినా కనీసం తన మీడియా ద్వారా అయినా కాస్త ఇన్‌ఫర్మేషన్‌ పోస్ట్‌ చేస్తూ వుండాలిగా!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English