సునీల్‌కి మళ్ళీ వెన్నుపోటు?

సునీల్‌కి మళ్ళీ వెన్నుపోటు?

హీరో వేషాల నుంచి కమెడియన్‌గా మారడానికి సునీల్‌ తన స్నేహితుడు త్రివిక్రమ్‌ మీదే భరోసా వుంచాడు. 'అరవింద సమేత వీర రాఘవ'లో సునీల్‌కి లీడ్‌ కమెడియన్‌ పాత్ర ఇచ్చినా కానీ చివర్లో లెంగ్త్‌ ప్రాబ్లమ్‌ వచ్చిందని, మూడ్‌ పాడవుతోందని సాకులు చూపించి అతని సీన్లు ఎడిట్‌ చేసేసారు. స్నేహితుడు కాబట్టి త్రివిక్రమ్‌ని ఏమీ అనలేకపోయాడు. ఆ చిత్రం వల్ల కమెడియన్‌గా రీఎంట్రీలో ఆశించిన స్థాయి స్పందన రాకపోయినా 'అమర్‌ అక్బర్‌ ఆంటొని' ఆ లోటు తీరుస్తుందని సునీల్‌ భావించాడు. కానీ ఈసారి కూడా సునీల్‌కి ఎదురు దెబ్బ తగిలిందట.

సునీల్‌పై శ్రీను వైట్ల ఎన్నో కామెడీ సీన్లు తీసినా కానీ ఫైనల్‌గా సినిమా నిడివి పెరగకూడదని సునీల్‌ సీన్లే ఎక్కువగా తీసేసారట. దీంతో సినిమా మొదలైనపుడు సునీల్‌ ఇందులో లీడ్‌ కమెడియన్‌ అయినా కానీ ఫైనల్‌గా 'స్వామిరారా' ఫేమ్‌ సత్య క్యారెక్టర్‌ హైలైట్‌ అయిందట. అసలే సినిమానిండా కొత్త కమెడియన్లు వుండగా తన పాత్ర ఇలా కుదింపుకి గురవడంతో సునీల్‌ బాగా హర్ట్‌ అయ్యాడట. గతంలో తన సీన్లు మాత్రం తీసేయకుండా జాగ్రత్త పడ్డ దర్శకులే ఇప్పుడు తన పాత్రని తగ్గించేస్తోంటే సునీల్‌కి బాధగా వుంటుందిగా. ఏదైనా అద్భుతమైన క్యారెక్టర్‌ త్వరగా పడి మళ్లీ తన హవా మొదలైతే తప్ప ఈ రీఎంట్రీతో రిజల్ట్స్‌ రావు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English