పాపం ఫ్లాప్‌ హీరో పని అంతే

పాపం ఫ్లాప్‌ హీరో పని అంతే

అసలే వరుస ఫ్లాపులతో తన సినిమాలు రిలీజ్‌ కూడా కాలేని పరిస్థితిని ఎదుర్కొంటున్న తరుణ్‌ ఎన్నో ఆశలు పెట్టుకున్న 'చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి' ఎట్టకేలకు విడుదలయింది. నిర్మాణ దశలోనే ఎన్నో ఇబ్బందులు పడ్డ ఈ చిత్రం ఎలాగైతేనేం రిలీజయిందని అనిపించుకుంది.

అయితే నామమాత్రపు పబ్లిసిటీ కూడా లేకపోవడం, తరుణ్‌ మీద ప్రేక్షకులకి ఆసక్తి అస్సల్లేకపోవడంతో ఈ చిత్రానికి ఓపెనింగ్స్‌ కూడా రాలేదు. సినిమా కూడా చెత్తగా ఉందని విమర్శకులు చీల్చి చెండాడుతున్నారు. అప్పట్లో తనకి హిట్‌ వస్తుందని ఏరి కోరి మరీ సలామ్‌ నమస్తే కథ ఆధారంగా సినిమా తీయమని నిర్మాతలని కోరాడు. వారు అదే పని చేశారు. అయితే సినిమా వెలుగు చూడడానికి ఇన్నేళ్లు పట్టింది. తీరా విడుదలయ్యాక ఇది విడుదలవకుండా ఉంటేనే బాగుండేదనిపించే ఫలితాన్ని చవిచూసింది. పాపం తరుణ్‌!

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు