8 సినిమాల్లో ఐశ్వర్య.. ఒక్క సినిమాలో అభిషేక్

8 సినిమాల్లో ఐశ్వర్య.. ఒక్క సినిమాలో అభిషేక్

ఎనిమిదేంటి.. ఒక్కటేంటి.. ఏమిటీ లెక్క అంటారా? ఇది పారితోషకాల్లో పైచేయికి సంబంధించిన గణాంకాలు. సాధారణంగా హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు పారితోషకం ఎక్కువ ఇస్తుంటారు. ఇద్దరి పారితోషకాల్లో అంతరం చాలా ఉంటుంది. కానీ తాను.. తన భార్య ఐశ్వర్యా రాయ్ కలిసి నటించిన సినిమాల్లో చాలా వరకు ఆమెకే ఎక్కువ రెమ్యూనరేషన్ దక్కించుకుందని అభిషేక్ నిజాయితీగా చెప్పుకున్నాడు.

 మొత్తం తామిద్దరం కలిసి తొమ్మిది సినిమాల్లో నటిస్తే.. ఒక్క చిత్రంలో మాత్రమే ఆమెకంటే తనకు ఎక్కువ పారితోషకం ఇచ్చారన్నాడు. మిగతా ఎనిమిది సినిమాల్లోనూ ఆమెకే ఎక్కువ రెమ్యూనరేషన్ అందిందన్నాడు.

సినీ పరిశ్రమలో పురుషులు, మహిళల మధ్య పారితోషకాల్లో అంతరాల గురించి పెద్ద చర్చ నడుస్తుండటం.. కంగనా రనౌత్ లాంటి కొందరు ఈ వివక్షపై గళమెత్తడం తెలిసిందే. ఈ నేపథ్యంలో అభిషేక్ స్పందించాడు. ‘‘సినీ  పరిశ్రమలో పారితోషికంపై చాలా చర్చలే జరుగుతున్నాయి. నేను నా భార్య ఐశ్వర్యతో తొమ్మిది సినిమాలు చేశాను. అందులో ఎనిమిది సినిమాలకు నా కన్నా ఆమెకే ఎక్కువ పారితోషికం ఇచ్చారు. ‘పీకూ’ సినిమాలో మిగతా వాళ్లకంటే దీపికా పదుకొనేకే ఎక్కువ పారితోషికం అందింది. సినిమా అనేది వ్యాపారం. మీకున్న క్రేజ్‌.. మార్కెట్‌ ను బట్టి పారితోషికం వస్తుంది. కొత్తగా చిత్ర పరిశ్రమకు వచ్చిన వాళ్లు ‘నాకు షారుక్‌ కు ఇచ్చేంత పారితోషికం ఇవ్వాలి’ అని డిమాండ్‌ చేస్తే ఎలా ఉంటుంది’’ అని అభిషేక్ ప్రశ్నించాడు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English