రష్మిక.. రష్మిక... ఎటు చూసినా రష్మిక

రష్మిక.. రష్మిక... ఎటు చూసినా రష్మిక

గీత గోవిందంతో తెలుగు కుర్రాళ్ల హృదయాల్లో నిలిచిపోయిన రష్మిక మందానకి ఇప్పుడు అంతటా ఫుల్‌ డిమాండ్‌ వుంది. త్వరలోనే ఆమె భారీ సినిమాల్లో కాలు పెడుతుందనే టాక్‌ బాగా వినిపిస్తోంది. ఇంకా తనవరకు పెద్ద సినిమాలు వెళ్లలేదు కానీ ఏ భారీ చిత్రం మొదలైనా కానీ అందులో హీరోయిన్‌గా రష్మిక పేరు పరిశీలిస్తున్నారనే టాక్‌ అయితే ముందు బయల్దేరిపోతోంది.

ఎన్టీఆర్‌, చరణ్‌తో రాజమౌళి తీస్తోన్న 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో ఇంకా హీరోయిన్‌ ఎవరూ ఫిక్స్‌ కాలేదు. కానీ రష్మిక ఒక హీరోయిన్‌గా నటించనుందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. తాజాగా తమిళ హీరో విజయ్‌ అరవై మూడవ చిత్రం అనౌన్స్‌ అయితే అందులో హీరోయిన్‌ రష్మిక కావచ్చునని మీడియా ఊదరగొడుతోంది. భారీ సినిమాల్లో అవకాశం కోసం ఎదురు చూస్తోన్న రష్మిక ఈ ఉత్కంఠ తాళలేకపోతోంది.

దయచేసి ఎక్స్‌పెక్టేషన్లు పెంచకండిరా అంటూ మీడియాని, అభిమానులని వేడుకుంటోంది. హీరోయిన్‌గా ఉజ్వల భవిష్యత్తు వుందని గ్రహించడంతోనే పెళ్లి కాన్సిల్‌ చేసుకున్న రష్మికకి ఒక్క పెద్ద సినిమాలో అవకాశం రావాలే కానీ ఇక వరుసగా మరెన్నో ఆఫర్లు వచ్చి పడకపోతే చూడండి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English