రవితేజ మైండ్‌ బ్లోయింగ్‌ డెసిషన్‌

రవితేజ మైండ్‌ బ్లోయింగ్‌ డెసిషన్‌

టచ్‌ చేసి చూడు, నేల టిక్కెట్టు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద మట్టి కరిచిన తర్వాత మాస్‌ మహారాజా ఆలోచనల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ప్రాజెక్ట్‌ సెట్‌ అయితే ఏదో ఒక కథ అన్నట్టు చేసుకుపోయే రవితేజ ఇప్పుడు అంత తేలిగ్గా కథ ఓకే చేయడం లేదు. రెండు మాస్‌ చిత్రాలని లైన్లో పెట్టిన రవితేజ వాటిని కాన్సిల్‌ చేసి వి.ఐ. ఆనంద్‌తో సైన్స్‌ ఫిక్షన్‌ సినిమా చేస్తున్నాడు. 'టేకెన్‌'లాంటి హాలీవుడ్‌ సినిమా తరహా యాక్షన్‌ చిత్రం చేయాలని వుందని రవితేజ అంటున్నాడు. అలాంటి కథతో ఎవరైనా వస్తారని ఎదురు చూస్తున్నానని చెప్పాడు. అందుకేనేమో సిక్స్‌ ప్యాక్‌ బాడీతో రెడీగా వున్నాడు! ఇదిలావుంటే ఈమధ్య రవితేజ నెట్‌ఫ్లిక్స్‌లో సిరీస్‌ ఎక్కువగా చూస్తున్నాడట.

ఆ కాన్సెప్టులు చాలా నచ్చుతున్నాయని, తాను కూడా అలాంటి సిరీస్‌ చేయడానికి సిద్ధమని రవితేజ సంచలన ప్రకటన చేసాడు. టీవీ షోలు చేయడమే చిన్నతనంగా ఫీలయ్యే లెవల్‌ నుంచి మన హీరోలు ఇప్పుడు చాలా అడ్వాన్స్‌గా థింక్‌ చేసే లెవల్‌కి వచ్చారనే దానికి ఇదే మంచి ఉదాహరణ. సిరీస్‌ అంటే సీరియల్స్‌ మాదిరిగా ఎనిమిది లేదా పది ఎపిసోడ్స్‌తో సీజన్స్‌ లెక్కన చేస్తుంటారు. హాలీవుడ్‌లో ఇది చాలా పాపులర్‌. ఈమధ్యే ఇండియాలోను ఇది మొదలైంది. సైఫ్‌ అలీ ఖాన్‌ 'సేక్రెడ్‌ గేమ్స్‌' అనే సిరీస్‌ హిందీలో చేస్తున్నాడు. తెలుగులో ఇంకా ఏ స్టార్‌ ఈ దిశగా అడుగు వేయలేదు. రవితేజ లాంటి వాళ్లు ఆసక్తిగా వున్నారంటే యువ ఫిలిం మేకర్స్‌ మరింత ఉత్సాహంతో ఈ తరహా సిరీస్‌లకి శ్రీకారం చుడతారు. మాస్‌ మహారాజా ఇప్పుడెంత క్లాస్‌గా ఆలోచిస్తున్నాడో కదూ!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English