కొరటాల చుట్టూ మెగా కంచె!

కొరటాల చుట్టూ మెగా కంచె!

వరుస విజయాలు అందిస్తోన్న కొరటాల శివతో పని చేయాలని ఏ స్టార్‌కి వుండదు. ఆల్రెడీ బిజీగా వున్న వారిని అటుంచితే మిగిలిన వారంతా కొరటాలతో ఛాన్స్‌ కోసం వేచి చూస్తున్నారు. అల్లు అర్జున్‌ అయితే ఎలాగైనా కొరటాల శివతో సినిమా చేయడం కోసం చాలా ట్రై చేసాడు. నాగార్జున కూడా అఖిల్‌ కోసం అతడికి ఎంత పారితోషికం ఇవ్వడానికైనా సిద్ధమయ్యాడు. అయితే కొరటాల శివ మాత్రం చిరంజీవితో సినిమా చేయాలని డిసైడ్‌ అయ్యాడు. చిరంజీవి సైరాతో బిజీగా వుండడంతో కొరటాల వేరే సినిమా చేస్తాడేమో అనుకున్నా కానీ అతను ఓపిగ్గా చిరంజీవి కోసమే ఎదురు చూస్తున్నాడు. ఇదిలావుంటే కొరటాలకి చరణ్‌ రెండు సినిమాలకి అడ్వాన్స్‌ ఒకేసారి ఇచ్చేసాడని టాక్‌ వినిపిస్తోంది.

చిరంజీవితో చేసే సినిమా కాకుండా తనతో కూడా సినిమా చేయడానికి కొరటాలతో చరణ్‌ ఒప్పందం చేసుకున్నాడట. నిజానికి ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా ఎప్పట్నుంచో టాక్స్‌లో వుంది. ఒకసారి సినిమా లాంఛ్‌ అయ్యాక కూడా ఆగిపోయింది. అయినా కానీ ఇద్దరి మధ్య సఖ్యత మాత్రం చెడలేదు. మళ్లీ సినిమా చేయాలని చాలా కాలంగా చూస్తున్నారు. ఈలోగా చరణ్‌ 'ఆర్‌ ఆర్‌ ఆర్‌'తో బిజీ అవడంతో ఆ ప్రాజెక్ట్‌ వాయిదా పడిందంతే. రాజమౌళి చిత్రం పూర్తయ్యే సరికి కొరటాల సినిమా క్యూలో పెట్టాలనేది చరణ్‌ ఐడియానట. అంటే కొరటాల దాదాపు మూడేళ్ల పాటు మెగా కంచె దాటి బయటకి రాడన్నమాట!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English