డజను ఫ్లాపుల తర్వాతైనా హిట్టొస్తుందా?

డజను ఫ్లాపుల తర్వాతైనా హిట్టొస్తుందా?

యువ హీరో సందీప్‌ కిషన్‌ ఇటు తెలుగు, అటు తమిళం అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తున్నాడు కానీ ఎక్కడా కలిసి రావడం లేదు. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' తర్వాత అతను నటించిన సినిమాలన్నీ ఫ్లాపయ్యాయి. అంతంత మాత్రంగా ఆడిన 'బీరువా'ని మినహాయిస్తే, తమిళ డబ్బింగ్‌ సినిమాలతో కలిపి సందీప్‌ కిషన్‌కి దాదాపు డజను ఫ్లాపులొచ్చాయి. ఇంకా హీరోగా సర్వయివ్‌ అవుతోన్న సందీప్‌ కిషన్‌ ఎప్పుడు ఏ కొత్త సినిమా రిలీజ్‌కి సిద్ధమైనా ఎక్సయిట్‌ అవుతుంటాడు. చాలా కాలంగా నిర్మాణంలోనే ఆగిపోయిన 'నెక్స్‌ట్‌ ఏంటి' చిత్రం ఎట్టకేలకు రిలీజ్‌కి సిద్ధమవుతోంది.

తమన్నా హీరోయిన్‌గా వుండడం వల్ల ఈ చిత్రానికి క్రేజ్‌ వుంటుందనేది అతని ఆశ. తెలుగులో ప్రస్తుతం సందీప్‌ కిషన్‌కి సినిమాలు లేవు. త్వరలో ఒక తమిళ హిట్‌ సినిమాని రీమేక్‌ చేస్తానని మాత్రం చెప్పాడు. సదరు చిత్రానికి కాస్త క్రేజ్‌ ఏర్పడాలన్నా, ట్రేడ్‌ దానిని సీరియస్‌గా తీసుకోవాలన్నా, తను నటిస్తోన్న తమిళ చిత్రం 'నరగాసురన్‌' అనువాదానికి మార్కెట్‌ రావాలన్నా కూడా 'నెక్స్‌ట్‌ ఏంటి' ఫలితం కీలకమవుతుంది. మరి ఎప్పటిలా సందీప్‌ ఆశ పడడం, సినిమా నిరాశ పరచడమే అవుతుందా, లేక మళ్లీ అదృష్టం కలిసొచ్చి విజయలక్ష్మి వరిస్తుందా? నెక్స్‌ట్‌ ఏంటి?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English