పవన్‌కళ్యాణ్‌ ఇవ్వలేనిది నాని ఇస్తాడా?

పవన్‌కళ్యాణ్‌ ఇవ్వలేనిది నాని ఇస్తాడా?

తమిళంలో అగ్ర సంగీత దర్శకుడిగా వెలుగొందుతోన్న అనిరుధ్‌ తెలుగు చిత్ర రంగంపై కూడా తన ముద్ర వేయాలని చూస్తున్నాడు. ఎన్నో ఆఫర్లని కాదని 'అజ్ఞాతవాసి'తో ఎంట్రీ ఇచ్చిన అనిరుధ్‌కి అటు త్రివిక్రమ్‌, ఇటు పవన్‌కళ్యాణ్‌ ఇద్దరూ చాలా హైప్‌ ఇచ్చారు. పవన్‌ అయితే ఒక అడుగు ముందుకేసి మైఖేల్‌ జాక్సన్‌ మ్యూజిక్‌ తర్వాత తాను అంతగా ఎంజాయ్‌ చేసేది అనిరుధ్‌ మ్యూజిక్కేనన్నాడు. ఆ సినిమా ఫ్లాపవడంతో అనిరుధ్‌ని కూడా ఒక లోపంగా ఎత్తి చూపారు. దాంతో 'అరవింద సమేత' చిత్రానికి సంగీత దర్శకుడిగా అనౌన్స్‌ చేసి కూడా తప్పించారు.

ఏ టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌కి అయినా ఇంతకుమించి అవమానం వుండదు. అందుకే తెలుగు చిత్ర రంగానికి తానేంటో చూపించాలనే ఛాన్స్‌ కోసం చూస్తోన్న అనిరుధ్‌ 'జెర్సీ' చిత్రానికి పని చేస్తున్నాడు. నాని హీరోగా రూపొందుతోన్న ఈ చిత్రంలో సంగీతానికి ప్రాధాన్యత ఎక్కువేనట. తెలుగు నాట పవన్‌కళ్యాణ్‌ సినిమాతో తెచ్చుకోలేకపోయిన గుర్తింపు నాని సినిమాతో అనిరుధ్‌ సాధిస్తాడా? తమిళంలో తన పాటలకి అగ్ర హీరోలందరి చేత చిందులు వేయించినట్టుగా ఇక్కడ కూడా తన కోసం అగ్ర హీరోల చిత్రాలు క్యూ కట్టే లెవల్‌కి చేరుకుంటాడా? ఇళయరాజా, రహమాన్‌ తర్వాత ఆ స్థాయిలో తెలుగునాట సంచలనం చేసిన తమిళ సంగీత దర్శకులు లేరు. ఆ లెజెండ్స్‌ మాదిరిగా అనిరుధ్‌ కూడా తన సంగీతానికి ఎల్లలు లేవని చాటుకోగలడా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English