ఇది చరణ్‌కి అగ్ని పరీక్షే!

ఇది చరణ్‌కి అగ్ని పరీక్షే!

రామ్‌ చరణ్‌ వెండితెరపై అభిమానులని అలరించేలా ఎన్ని విన్యాసాలు చేసినా కానీ డిసిప్లిన్‌ తక్కువనేది అతనిపై వున్న అతి పెద్ద కంప్లయింట్‌. తరచుగా షూటింగ్స్‌కి డుమ్మా కొట్టడం, షెడ్యూల్స్‌ మధ్య హాలిడేస్‌ ఎక్కువ తీసుకోవడం వల్ల తరచుగా అతని సినిమాలు పూర్తవడం ఆలస్యం అవుతుంటుంది. తద్వారా నిర్మాతలకి కాస్త అధిక పెట్టుబడి అవుతుంది. అలాగే డైరెక్టర్లపై ఒత్తిగా కూడా పెరుగుతుంటుంది. అయితే బాక్సాఫీస్‌ స్టామినా పరంగా చూపించే కన్సిస్టెన్సీ వల్ల, చిరంజీవి తనయుడు కావడం వల్ల ఎవరూ దీని గురించి బయటకి కంప్లయింట్‌ చేయరు.

ఇంతకాలం తన సౌఖ్యానికి తగ్గట్టు సినిమాలు చేసుకుంటూ వచ్చిన చరణ్‌కి ఈసారి అగ్ని పరీక్ష ఎదురవుతుంది. ఎందుకంటే రాజమౌళి చిత్రానికి ఇష్టం వచ్చినట్టు షూటింగ్‌కి వెళితే కుదరదు. సాటి కో స్టార్‌ ఎన్టీఆర్‌కి డిసిప్లిన్‌ కాసింత ఎక్కువే. షూటింగ్‌ షెడ్యూల్స్‌ పరంగా తారక్‌ చాలా డెడికేటెడ్‌గా వుంటాడు. రాజమౌళి చిత్రం షూటింగ్‌ ఒక్క రోజు కాన్సిల్‌ అయ్యే సీన్‌ వుండదు. ఈ నేపథ్యంలో చరణ్‌కి ఈ చిత్రం వల్ల తన కేర్‌ఫ్రీ లైఫ్‌స్టయిల్‌ నుంచి బ్రేక్‌ పడక తప్పదు. ఈ చిత్రం యేడాదికి పైగానే షూటింగ్‌ జరుపుకుంటుంది కనుక వన్‌ ఇయర్‌ పాటు చరణ్‌కిక హాలిడేస్‌ వుండవు. ఈ సినిమా ఎఫెక్ట్‌తో చరణ్‌ తనలో వున్న ఆ చిన్న డిఫెక్ట్‌ని కూడా కవర్‌ చేసేసుకుంటాడేమో కూడా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English