జామర్ వాడనున్న రాజమౌళి?

జామర్ వాడనున్న రాజమౌళి?

సంచలన దర్శకుడు రాజమౌళి తన తదుపరి సినిమాను మొదలుపెట్టేశాడు. #RRR ఇప్పిటికే సందడి మొదలుపెట్టేసి.. ముహూర్తం ఈవెంట్ కూడా ఫినిష్‌ చేసి.. షూటింగ్ కు వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న విషయం కూడా లీక్ అవ్వకుండా ఇప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

అసలు #RRR షూటింగ్ సెట్లోకి సెల్‌ ఫోన్ అనేదే తీసుకురానివ్వరు. కాబట్టి ఎవరన్నా ఫోటోలో తీసి బయటకు లీక్ చేస్తారు అనే సందేహమే లేదు. హైదరాబాద్ శివారును కోకాపేటలో వేసిన సెట్ పలానా అంటగా అని మనం సినిమా రిలీజయ్యాక తెలుసుకోవాల్సిందే కాని.. ఇప్పుడు మనకు ఆ సెట్ తాలూకు ఫోటోలు అయితే రిలీజ్ చేయరు. మరి రాజమౌళి జామర్స్ ఎందుకు వాడుతున్నాడబ్బా? నిజానికి ఈ సినిమా మీదున్న క్రేజ్ తో.. ఎవరన్నా బటన్ కెమెరా పెన్ కెమెరా వంటి సీక్రెట్ కెమెరాలు పెట్టుకొచ్చి ఏదన్నా వీడియో తీస్తారేమోనని జక్కన్న అండ్ టీమ్ భయపడుతోందట. అందుకే చైనా నుండి తెప్పించిన జామర్స్ ను సెట్లో అమర్చడం వలన.. ఇలాంటి సీక్రెట్ కెమెరాలు పనిచేయకుండా చూసుకునే టెక్నాలజీ అవి అందిస్తాయట.

ఏదేమైనా కూడా.. #RRR విషయంలో రాజమౌళి మామూలు సీక్రెట్ మెయిన్టయిన్ చేయడన్నమాట. పైగా ఈ తరహాలో ఒక్క విజువల్ కూడా చూపించకపోతే..చివరకు హైప్ పెరిగి సినిమాకు వందలు కోట్లు వసూళ్ళు వచ్చే ఛాన్సు కూడా ఉంది. అది సంగతి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English