బాహుబలిని కొట్టేందుకు ఈసారి మెగా ప్లాన్‌

బాహుబలిని కొట్టేందుకు ఈసారి మెగా ప్లాన్‌

బాహుబలి సాధించిన చారిత్రాత్మక విజయం చూసి తాను కూడా అలాంటి సినిమా చేసేయాలనే ఉబలాటంతో 'థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌' చేసి భంగపడ్డాడు అమీర్‌ ఖాన్‌. ఇది బాహుబలిని చూసి పెట్టుకున్న వాత అని, ఎప్పుడూ తన సినిమాల విషయంలో పర్‌ఫెక్షన్‌ కోసం చూసే అమీర్‌ ఈసారి ఏదో సాధించేయాలనే ఆదుర్దాతో మొదటికే చేటు చేసుకున్నాడని విమర్శలు వస్తున్నాయి.

తొందరపాటులో ఎంత తప్పు చేసాడనేది సినిమా విడుదల కాకముందే అమీర్‌ రియలైజ్‌ అయిపోయాడు. అందుకే తన స్వభావానికి విరుద్ధంగా ఈ చిత్రాన్ని ప్రమోట్‌ చేయడానికి కూడా అమీర్‌ ఉత్సాహం చూపించలేదు. థగ్స్‌ అట్టర్‌ఫ్లాప్‌ అవడంతో అమీర్‌ ఈసారి నిజంగా బాహుబలిని టార్గెట్‌గా పెట్టుకుని అకుంటిత దీక్షతో బృహత్తర ప్రయత్నం చేయబోతున్నాడు. బాహుబలిని కొట్టాలంటే దానికి మించినది తీయాలని అమీర్‌ గ్రహించాడు.

అందుకే తన చైనా, ఇతర దేశాల మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకుని వెయ్యి కోట్లతో ఒక భారీ పౌరాణిక చిత్రం చేయాలని ప్లాన్‌ చేస్తున్నాడు. దీనికి సంబంధించి కొందరు రచయితలు, తెలిసిన దర్శకులతో అమీర్‌ మంతనాలు సాగిస్తున్నాడు. అమీర్‌ ఆలోచన తెలిసి రెండు, మూడు కార్పొరేట్‌ కంపెనీలు ఇన్వెస్ట్‌ చేయడానికి సై అంటున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English