బిగ్‌బాస్‌ చూసి ఇన్‌స్పయిర్‌ అయిన రాజమౌళి!

బిగ్‌బాస్‌ చూసి ఇన్‌స్పయిర్‌ అయిన రాజమౌళి!

బిగ్‌బాస్‌ షో చూసినపుడు ఎవరికైనా అందులో ఆట ఆడే వాళ్ల మీదే దృష్టి వుంటుంది. కానీ రాజమౌళి లాంటి మేథావి దర్శకులకి ఆ ఇంటి మీద కన్ను పడుతుంది. పదిహేను మంది వంద రోజుల పాటు వుండడానికి అవసరమైన వసతులు, సదుపాయాలు ఒక సెట్లో సమకూర్చడం కుదురుతుందని బిగ్‌బాస్‌ ద్వారా రాజమౌళి తెలుసుకున్నాడు. అందుకే తన కొత్త సినిమా షూటింగ్‌లో ఆ స్ఫూర్తితో సెట్లోనే ఒక ఇల్లు కట్టించేసాడు. షూటింగ్‌ స్పాట్‌ నుంచి హీరోలు, ఇతరులు ఇంటికెళ్లి, మళ్లీ షూటింగ్‌కి రావడమంటే చాలా టైమ్‌ వృధా అవుతూ వుంటుంది.

అందుకే రాజమౌళి అక్కడే ఒక ఇల్లు కట్టించేసి హీరోలిద్దరికీ చెరో రూమ్‌ ఏర్పాటు చేయించి, మిగతా టీమ్‌కి అక్కడే వుండడానికి కావాల్సిన వసతులు, వనరులు అన్నీ సమకూర్చాడట. ఈ చిత్రం షూటింగ్‌ పార్ట్‌ని ఏడాది కాలంలో పూర్తి చేస్తానని ఇద్దరు హీరోలకి మాట ఇవ్వడంతో ఈ సమయాన్ని పూర్తిగా వినియోగించుకోవడానికి రాజమౌళి తనదైన శైలిలో టైమ్‌ మేనేజ్‌మెంట్‌ చేస్తున్నాడన్నమాట. ఈ సెట్లోనే చాలా కాలం పాటు షూటింగ్‌ చేస్తారు కనుక హీరోలు కూడా పలుమార్లు అదే సెట్లో, అదే ఇంట్లో కొన్ని రోజుల పాటు ఇంటికి వెళ్లకుండా ఉండిపోవాల్సి వుంటుందట. అంటే హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుగుతున్నా కానీ అవుట్‌డోర్‌లో షూటింగ్‌ చేస్తున్నట్టే వారంతా భావించాల్సి వుంటుందన్నమాట. జక్కన్నా... మజాకా!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English