బన్నీ టీషర్ట్ రేటు అంతా?

బన్నీ టీషర్ట్ రేటు అంతా?

అల్లు అర్జున్‌కు స్టైలిష్ స్టార్ అనే పేరు ఊరికే వచ్చేయలేదు. బాలీవుడ్ హీరోలకు దీటుగా అతను స్టైలింగ్ విషయంలో దూసుకెళ్లాడు. ఎప్పటికప్పుడు అప్ టు డేట్‌గా ఉంటూ.. ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ.. చాలా స్టైలిష్‌గా తయారవుతుంటాడతను. ముందు తరంలో అక్కినేని నాగార్జున ఇలాగే చేసేవాడు.

ఈ తరంలో బన్నీ స్లైల్ ఐకాన్‌గా నిలిచాడు. లుక్స్ పరంగా యావరేజ్ అయినప్పటికీ.. ఈ స్టైలింగ్‌తోనే బన్నీ తన ప్రత్యేకతను చాటుకుంటూ వచ్చాడు. యూత్‌ అతడి స్టైల్స్‌ని బాగా ఫాలో అవుతుంటారు. ఏదైనా ఈవెంట్ ఉందంటే బన్నీ తయారై వచ్చే తీరే వేరుగా ఉంటుంది. హేర్ స్టైల్‌ నుంచి డ్రెస్సింగ్ వరకు ప్రతిదీ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటాడతను. తాజాగా 'ట్యాక్సీవాలా' ప్రి రిలీజ్ ఈవెంట్‌కు బన్నీ వేసుకొచ్చిన టీ షర్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

'givenchy' అనే ఫేమస్ ఇంటర్నేషనల్ బ్రాండ్ టీషర్ట్ తొడుక్కుని ఈ ఈవెంట్‌కు వచ్చాడు బన్నీ. కాసేపటికే సోషల్ మీడియాలో ఈ టీషర్ట్ గురించి చర్చ మొదలైపోయింది. దాని ఖరీదు గురించి ముందు రకరకాల ఊహాగానాలు వచ్చాయి. చివరికి ఆ టీ షర్ట్ ధర రూ.65 వేలని తేల్చారు. టీషర్టుకి అంత రేటా అంటూ ఆశ్చర్యపోవడం జనాల వంతైంది.

ఆన్ లైన్లో ఈ టీ షర్ట్ ధరను సూచించే ఫొటోను బన్నీ అభిమానులు వైరల్ చేశారు. రెండు రోజులుగా ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఇండస్ట్రీ జనాలు సైతం దీని గురించి స్పందించడం విశేషం. ఇంతకీ బన్నీ ఈ టీషర్ట్ ఎక్కడి నుంచి తెప్పించాడని కూడా నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మొత్తానికి తన కొత్త సినిమా ఏదో తేల్చకుండా ఖాళీగా ఉన్న టైంలో కూడా బన్నీ సోషల్ మీడియాలో ఇలా హాట్ టాపిక్‌గా మారడం విశేషమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English