బెల్లంకొండ బాబుకు 50 కథలు చెప్పారా?

బెల్లంకొండ బాబుకు 50 కథలు చెప్పారా?

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా అరంగేట్రం చేసి నాలుగేళ్లు దాటుతోంది. ఇప్పటిదాకా హిట్టు రుచి చూడలేదు. నిజానికి 'అల్లుడు శీను'.. 'జయ జానకి నాయక' సినిమాలు వాటి స్థాయిలో అవి బాగానే ఆడాయి. కానీ వాటి మీద పరిమితికి మించి ఖర్చు పెట్టేయడంతో అవి కాస్ట్ ఫెయిల్యూర్లుగా నిలిచాయి. ఫ్లాప్ అనిపించుకున్నాయి. ఇక 'స్పీడున్నోడు'.. 'సాక్ష్యం' సినిమాల గురించి చెప్పాల్సిన పని లేదు. అవి నిఖార్సయిన డిజాస్టర్లుగా మిగిలాయి.

మొత్తంగా ఇప్పటిదాకా చేసిన ఐదు సినిమాలతోనూ శ్రీనివాస్ కు నిరాశ తప్పలేదు. ఇప్పుడతను ఒకేసారి రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో ఒకటి.. కవచం. చడీచప్పుడు లేకుండా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం తాజాగా టీజర్ తో పలకరించింది. శ్రీనివాస్ మామిళ్ల అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు.

తన కెరీర్లో ఇప్పటిదాకా చేసిన సినిమాలతో పోలిస్తే ఇది పూర్తి భిన్నమైన చిత్రం అంటున్నాడు శ్రీనివాస్. ఈ సినిమాకు ముందు తాను 50 కథలు విని.. ఏదీ నచ్చక పక్కన పెట్టేసినట్లు శ్రీనివాస్ వెల్లడించాడు. చివరికి శ్రీనివాస్ మామిళ్ల చెప్పిన కథ నచ్చి 'కవచం' చేసినట్లు చెప్పాడు. ఐతే ఇప్పటిదాకా హిట్టు ముఖమే ఎరుగని బెల్లంకొండ శ్రీనివాస్ కు ఏకంగా 50 మంది కథలు చెప్పారా అన్నది డౌటు.

అతడికి ఏ స్టార్ హీరోనో ఇలాంటి మాట అంటే జనాలు ఓకేలే అనుకుంటారు కానీ.. ఎలాంటి ఇమేజ్ లేని శ్రీనివాస్ ఈ మాట చెప్పేసరికి జనాలకు కొంచెం కామెడీగా అనిపిస్తోంది. శ్రీనివాస్ లాంటి హీరో దగ్గరికే 50 కథలు వెళ్తే ఇక మిగతా హీరోల పరిస్థితేంటో మరి. ఇక 'కవచం' సినిమా విషయానికి వస్తే.. ఈసారి శ్రీనివాస్ తక్కువ బడ్జెట్లో ఒక కాన్సెప్ట్ బేస్డ్ థ్రిల్లర్ చేస్తున్నట్లుగా ప్రచారం జరిగింది కానీ.. టీజర్ చూస్తే అలా ఏమీ కనిపించలేదు. ఎప్పట్లాగే శ్రీనివాస్ మీద కోట్లకు కోట్లు పోసినట్లున్నారు. ఇది కూడా రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్ లాగే అనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English