టార్గెట్ బాహుబలి.. ఒక వికెట్ డౌన్.. ఇంకోటి?

టార్గెట్ బాహుబలి.. ఒక వికెట్ డౌన్.. ఇంకోటి?

‘బాహుబలి’ సినిమా వేరే ఇండస్ట్రీల వాళ్లకు ఆనందం కంటే అసూయనే కలిగించింది. ముఖ్యంగా దక్షిణాదిన కోలీవుడ్.. ఉత్తరాదిన బాలీవుడ్ వాళ్లు ఈ సినిమా చూసి మనం ఇలాంటి సినిమా తీయలేకపోతున్నామే అని ఫ్రస్టేట్ అయిపోయారు.

శేఖర్ కపూర్ లాంటి లెజెండరీ డైరెక్టర్.. రాజమౌళిని చూపించి బాలీవుడ్ ఫిలిం మేకర్లకు గడ్డి పెట్టారు. ఇక దక్షిణాది సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడిగా పేరున్న శంకర్‌ను రాజమౌళి దాటేయడం అక్కడి వాళ్లకు నచ్చలేదు. దీంతో ‘బాహుబలి’ని మించే సినిమా తీయాలని అటు బాలీవుడ్ వాళ్లు.. ఇటు కోలీవుడ్ వాళ్లు గట్టిగా కోరుకున్నారు. ఈ ఏడాది ఈ రెండు ఇండస్ట్రీల నుంచి ‘బాహుబలి’ని బీట్ చేసే సత్తా ఉన్న చిత్రాలుగా రెండు లైన్లోకి వచ్చాయి. అవే.. థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, 2.0.

ఇందులో మొదటి సినిమా ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ దీపావళి కానుకగా విడుదలైంది. ఆమిర్ ఖాన్‌కు ఉన్న క్రెడిబిలిటీ.. అతడికున్న మార్కెట్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. చైనాలో సైతం భారీగా మార్కెట్ సంపాదించుకున్న ఆమిర్.. ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’తో అన్ని రికార్డులూ బద్దలు కొట్టేస్తాడని అనుకున్నారు. కానీ ఈ చిత్రం దారుణమైన ఫలితాన్నందుకుంది. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ‘బాహుబలి’ రికార్డుల గురించి ఏ కోశానా ఆలోచించే పరిస్థితి కనిపించలేదు.

దీంతో ఇక ఫోకస్ అంతా ‘2.0’ మీదికి వెళ్లింది. దీనిపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పాల్సిన పని లేదు. కానీ ఆ అంచనాలే సినిమాకు ప్రతికూలంగా కూడా మారే అవకాశాలు లేకపోలేదు. ఎక్స్‌పెక్టేషన్స్‌ని అందుకోవడం శంకర్ బృందానికి అంత సులువు కాదు. పైగా దీని ట్రైలర్ సినిమాపై కొంచెం సందేహాలు రేకెత్తించింది. ఈ నేపథ్యంలో ఇదైనా ‘బాహుబలి’ని కొడుతుందా లేదా అని అంతా ఎదురు చూస్తున్నారు. ‘2.0’ కూడా ఫెయిలైందంటే.. ఇక ఇప్పుడిప్పుడే ఎవ్వరూ ‘బాహుబలి’ రికార్డుల గురించి మాట్లాడరేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English