రెండు వందల కోట్లు... రెండోస్సారి!

రెండు వందల కోట్లు... రెండోస్సారి!

విజయ్‌తో పోటీ పడే తమిళ హీరోలు చాలా మంది వున్నారని ఆయా హీరోల అభిమానులు గప్పాలు కొడుతుంటారు కానీ వాస్తవానికి రజనీకాంత్‌ తర్వాత తమిళ సినిమాకి విజయ్‌ ఒక్కడే. అతనికి సమీపంలో కూడా ఎవరూ లేరని ప్రతి సినిమాతో రుజువు చేస్తూనే వున్నాడు. గత చిత్రం మెర్సల్‌తో రెండు వందల కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించిన విజయ్‌ ఈసారి వారం రోజుల్లోనే ఆ ఫీట్‌ పూర్తి చేసాడు. 'సర్కార్‌' ఏడు రోజుల్లో రెండు వందల కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించి, వంద కోట్లకి పైగా షేర్‌ దక్కించుకుని విజయం దిశగా దూసుకుపోతోంది.

నూట ముప్పయ్‌ అయిదు కోట్ల షేర్‌ వస్తే ఈ చిత్రం హిట్టయినట్టే లెక్క. రానున్న రోజుల్లో వసూళ్లు ఎంత తగ్గినా కానీ గ్యారెంటీగా హిట్‌ స్టేటస్‌ దక్కించుకుంటుంది. తెలుగులో అయితే ఆరు రోజుల్లో బ్రేక్‌ ఈవెన్‌ అయిపోయి లాభాల బాట పట్టింది. వరుసగా రెండోసారి రెండు వందల కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించిన విజయ్‌ ఈ చిత్రంతో తన పోటీదారునిగా భావించే అజిత్‌కి అతి పెద్ద టార్గెట్‌ని నిర్దేశించాడు. 2.0 విడుదలయ్యే వరకు తమిళంలో భారీ సినిమాలేవీ లేవు కనుక ఆలోగా మరో యాభై అరవై కోట్ల గ్రాస్‌ వసూళ్లు ఖాయం చేసుకోవచ్చు. దర్శకుడిగా మురుగదాస్‌ కంటే హీరోగా విజయ్‌ క్రెడిట్టే ఇందులో ఎక్కువ వుంది. కంగ్రాట్స్‌ ఇళయ దళపతీ!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English